'పిక్చర్ అభీ బాకీ హై' అంటూ ఒకర్నొకరు కవ్వించుకుంటున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. 'ఇంటర్వెల్ తర్వాతే అసలు మజా మొదలవుతుంది' అంటూ రంగంలోకి దిగారు సంజు శాంసన్, కేఎల్ రాహుల్. 'మేం ఇప్పటికే హీరోలం' అంటూ సవాల్ చేస్తున్నాడు రిషభ్ పంత్. మేమేమైనా తక్కువా అంటు రంగంలోకి దిగారు శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్. ఎందుకంటారా?
Also Read: CSK vs MI: మాపై ముంబయిదే పైచేయి.. అంగీకరించిన సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్
దాదాపుగా మూడు నెలల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ మొదలవుతోంది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో వాయిదా పడ్డ పొట్టి క్రికెట్ లీగు మళ్లీ మొదలవుతుండటంతో లీగ్ ప్రసారదారు స్టార్ అన్ని జట్లలోని స్టార్ క్రికెటర్లతో ఓ లఘు వీడియో రూపొందించింది.
Also Read: CSK vs MI: పంతం నీకా నాకా హై..! చివరి 5లో 4 ముంబయివే.. రోహిత్, ధోనీలో నేడు గెలిచేదెవరు?
నిన్నమొన్నటి వరకు టీమ్‌ఇండియాలో సహచరులైన క్రికెటర్లు ఫ్రాంచైజీల్లోకి వెళ్లగానే కవ్వించుకోవడం మొదలుపెట్టేశారు. దాంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాతో స్టార్ ఓ వీడియో చేయించింది. ఒకర్నొకరు కవ్వించుకుంటూ సవాళ్లు విసురుకోవడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Also Read: T20 World Cup: ధోనీని మించిన మెంటార్ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ
ఐపీఎల్ రెండో దశలో మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జట్లు కఠోర సాధన చేశాయి. ప్రస్తుతం ముంబయి ఎనిమిది పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచులో గెలిచి పది పాయింట్లు అందుకోవాలని పట్టుదలతో ఉంది. ఆ జట్టుకు ధోనీసేనపై మెరుగైన రికార్డు ఉండటం గమనార్హం. మరోవైపు మెరుగైన రన్‌రేట్, పది పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై సైతం మ్యాచ్ గెలిచి అందరికన్నా ముందుగా ప్లేఆఫ్ రేసులో ఉండాలని కోరుకుంటోంది.