డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు తమపై మెరుగైన రికార్డు ఉందని చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. అందుకే తమ ప్రమాణాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. విండీస్ పొడగరి కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఈ సీజన్ తొలి మ్యాచులో తాము ముంబయి చేతిలో ఓడామని పేర్కొన్నాడు. ఆదివారం నాటి మ్యాచుకు ముందు అతడు సీఎస్‌కే టీవీతో మాట్లాడాడు.
Also Read: CSK vs MI: పంతం నీకా నాకా హై..! చివరి 5లో 4 ముంబయివే.. రోహిత్, ధోనీలో నేడు గెలిచేదెవరు?
'కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఈ సీజన్ తొలి దశను ఓటమితో ముగించాం. ముంబయికి మాపై మెరుగైన రికార్డు ఉంది. అందుకే మా ప్రమాణాలు పెంచుకుంటున్నాం. కోచ్‌గా ఆలోచిస్తే మ్యాచ్ మా పరిధిలోనే ఉండాలని భావిస్తాను. కాబట్టి మేం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ఏదేమైనా మేం గొప్ప జట్టుతో తలపడబోతున్నాం. అందులో గెలవాలని కోరుకుంటున్నా' అని ఫ్లెమింగ్ అన్నాడు.
Also Read: IPL 2021: 'హే.. మీ దగ్గర నీళ్లున్నాయా?' బుమ్రా దంపతులకు సూర్య ప్రశ్న!
'మేం మరోసారి శుభారంభం చేయాలనుకుంటున్నాం. అయితే మేం ఫామ్‌లోకి వచ్చి గెలిచేందుకు కష్టపడాల్సిందే. అంతా మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కుర్రాళ్లంతా ఒక్కచోటికి చేరారు. రెండోదశను తాజాగా ఆరంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది కరీబియన్ ప్రీమియర్ లీగ్, అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చారు. మరింత అనుభవం సంపాదించి వచ్చినందుకు సంతోషంగా ఉంది' అని స్టీఫెన్ పేర్కొన్నాడు.
Also Read: T20 World Cup: ధోనీని మించిన మెంటార్ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ
'మా శైలి మాకుంది. కొత్త ఆటగాళ్లు జట్టులో సర్దుకుపోయారు. మ్యాచులకు సిద్ధమయ్యారు. జట్టు సమతూకంగా ఉంది. సీజన్ తొలి దశలో మేం దూకుడుగా ఆడాం. ప్రత్యర్థిని అంచనా వేసి బాగా బ్యాటింగ్ చేశాం. దుబాయ్‌లో గత సీజన్లో మేమీ పని చేయలేకపోయాం. ఈ సారి మాత్రం మేం పూర్తిగా సన్నద్ధమయ్యాం. విజయాలే సాధిస్తాం' అని ఫ్లెమింగ్ చెప్పాడు.