ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్ వన్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ బలహీనతలను దిల్లీ క్యాపిటల్స్ బయట పెడుతుందని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అంటున్నాడు. దిల్లీ పేస్ దాడిని ఆ జట్టు తట్టుకోలేదని అంచనా వేశాడు. ప్రతిసారీ రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో మీద ఆధారపడలేదని వెల్లడించాడు. మ్యాచుకు ముందు అతడు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు.
'దిల్లీ క్యాపిటల్సే అత్యుత్తమ జట్టు. ఎందుకంటే వారు మూడో అత్యుత్తమ జట్టైన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడుతున్నారు. ధోనీసేన బ్యాటింగ్ లైనప్ బలహీనతలను ఆ జట్టు బయటపెట్టనుంది. దిల్లీ బౌలింగ్ లైనప్‌లో పేస్ బౌలర్లు ఆన్రిచ్ నార్జ్, అవేశ్ ఖాన్ ఉన్నారు. మధ్య ఓవర్లలో కాగిసో రబాడా తన అదనపు పేస్‌తో భయపెడుతున్నాడు. అక్షర్ పటేల్, అశ్విన్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు పంత్‌సేనకు ఉన్నారు' అని హగ్ అన్నాడు.
'నార్జ్, అవేశ్ దిల్లీ ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ బలహీనతలను చూపించనున్నారు. వారిద్దరూ షార్ట్ పిచ్ బంతులతో దాడి చేస్తారు. త్వరగా వికెట్లు లభిస్తే మిడిలార్డర్ బలహీనతలు బయటపడతాయి. మొయిన్ అలీ లయ తప్పాడు. ఉతప్ప మిడిలార్డర్ పరిస్థితులకు అలవాటు పడలేదు. రైనా వచ్చినా పేస్‌ను ఇష్టపడడు. రాయుడు ఫామ్‌ను పూర్తిగా నమ్ముకోలేం. ధోనీ ఎప్పట్నుంచో టచ్‌లో లేడు. మిడిలార్డర్ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు వారు ప్రతిసారీ జడ్డూ, బ్రావో మీద ఆధారపడలేరు' అని హగ్ స్పష్టం చేశాడు.
Also Read: టీ20 ప్రపంచకప్ విజేతకు ఎంత డబ్బిస్తారో తెలుసా? ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ
Also Read: ఆడకున్నా.. అతడిని ఆడిస్తేనే చెన్నైకి మంచిది: సునిల్ గావస్కర్