ఐపీఎల్‌లో నేడు సాయంత్రం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో ఇది 47వ మ్యాచ్. షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయంతో చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది. రాజస్తాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవ్వాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే.


ఈసారి మార్పులు జరిగే అవకాశం
మహేంద్ర సింగ్ ధోని సాధారణంగా తుదిజట్టులో ఎక్కువ మార్పులు చేయడు.. కానీ ఇప్పుడు చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది కాబట్టి ఈ మ్యాచ్‌లో కొందరు కొత్త ఆటగాళ్లను చెన్నై జెర్సీలో చూసే అవకాశం ఉంది. కర్ణాటక ఆటగాడు కృష్ణప్ప గౌతంకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించవచ్చేమో! చెన్నై జట్టు మొత్తం టచ్‌లోనే ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డుఫ్లెసిస్, రాయుడు టచ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌తో ధోని కూడా టచ్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక శార్దూల్, దీపక్ చాహర్, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో.. అవసరం అయినప్పుడల్లా వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటున్నారు.


Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్‌! బుడగ వీడిన క్రిస్‌గేల్‌.. ఎందుకంటే?


మిడిలార్డర్ లైన్‌లోకి రావాల్సిందే!
ఇక రాజస్తాన్ విషయానికి వస్తే.. ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్‌లు రాజస్తాన్ తరఫున ఎక్కువ పరుగులు సాధించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. లియాం లివింగ్ స్టోన్, క్రిస్ మోరిస్‌లు అంతగా రాణించడం లేదు. ఈ గేమ్‌లో ఆల్‌రౌండర్ శివం దూబే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.


ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచి అగ్రస్థానం నిలబెట్టుకునేవైపు అడుగులు వేస్తుందా.. రాజస్తాన్ గెలిచి ప్లేఆఫ్స్ వైపు అడుగులు వేస్తుందా చూడాలి!


రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు(అంచనా)
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), లియాం లివింగ్ స్టోన్/ఫిలిప్స్, మహిపాల్ లోమ్‌రోర్/శివం దూబే, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్


చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుఫ్లెసిస్, మొయిన్ అలీ/కృష్ణప్ప గౌతం, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్‌వుడ్


Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!


Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి