ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. మహిళా బాక్సర్లు పసిడి పంచ్ లతో అదరగొట్టారు. ఇదివరకే ఈ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్షర్లు నీతూ ఘంఘాస్, సవీటీ బూరా, నిఖత్ జరీన్ పసిడి పతకాలు సాధించగా.. తాజాగా దేశానికే చెందిన స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో 70 - 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ కైత్లిన్ పార్కర్ పై లవ్లీనా 5-2 తేడాతో గెలుపొందింది. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం నెగ్గి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మహిళా బాక్సర్ లవ్లీనా తొలిసారి వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది.






మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ స్వర్ణాల వేట కొనసాగింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ 3 గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా తాజాగా తన ఖాతాలో మరో స్వర్ణాన్ని వేసుకుంది. ఆదివారం జరిగిన 48-50 కిలోల విభాగంలో ఫైనల్లో తెలుగు తేజం నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం గెలిచింది. రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నామీస్ బాక్సర్ థీ టామ్ పై  5-0తో విజయం సాధించగా.. 70- 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్ ఆస్ట్రేలియా బాక్సర్ ను ఓడించి స్వర్ణం నెగ్గింది. దీంతో భారత్ ఖాతాలో బాక్సింగ్ విభాగంలో నాలుగు స్వర్ణాలు చేరాయి.






మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నీతూ ఘంఘాస్ తర్వాత సవీటీ బూరా కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. 81 కేజీల విభాగంలో సవీటీ బూరా బంగారు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాను సవీటీ బూరా ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకు ముందు మంగోలియన్ బాక్సర్‌ను ఓడించి నీతు ఘంఘాస్ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. ఇప్పుడు సవీటీ బూరా చైనా క్రీడాకారిణిని ఓడించి రెండో స్వర్ణ పతకాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. నీతూ ఘంఘాస్ 48 కిలోల బరువు విభాగంలో స్వర్ణం సాధించింది.






భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన నీతూ ఘంఘాస్
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నీతూ ఘంఘాస్ స్వర్ణ పతకం సాధించింది. 48 కేజీల వెయిట్ విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సేఖాన్ అల్టెంగ్‌సెంగ్‌పై నీతూ ఘంఘాస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బాక్సర్ 5-0తో విజయం సాధించడం విశేషం.