భారత్ X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టుకు ముందు ఇరు జట్లకు వరుస షాకులు తగిలాయి. టీమిండియా ప్రధాన పేసర్ శార్దూల్‌ ఠాకూర్‌, ఇంగ్లాండ్‌ ప్రధాన పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ గాయాల బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ రెండో టెస్టుకి వాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. బ్రాడ్‌ బదులు మార్క్‌వుడ్‌, శార్దూల్‌ స్థానాన్ని ఇషాంత్‌ శర్మ భర్తీ చేస్తారని సమాచారం.


AlsoRead: IND vs ENG: లార్డ్స్ మైదానంలో కోహ్లీ సెంచరీ చేస్తాడా? లేక సచిన్, గావస్కర్ సరసన నిలుస్తాడా?


రెండో టెస్టు కోసం ఇరు జట్లు లండన్ చేరుకున్నాయి. లార్డ్స్ వేదికగా గురువారం రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేసే సమయంలో శార్దూల్ ఠాకూర్ పిక్క కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. గాయం ఎంత తీవ్రమైనదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ గాయం తీవ్రమైతే మాత్రం అతడు తుది జట్టులో చోటు కోల్పోతాడు. అతడి స్థానంలో ఇషాంత్ శర్మ లేదా ఉమేష్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని శార్దూల్‌ను తీసుకున్నాడు కోహ్లీ. పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం శార్దూల్ సొంతం. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌‌తో ఇంగ్లాండ్‌తో తలపడతామని కోహ్లీ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇషాంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.  


AlsoRead: T20 World Cup: కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై? రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్... T20 ప్రపంచకప్ తర్వాత కోచింగ్ జట్టులో భారీ మార్పులు?


మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లోనే స్టువర్ట్‌ బ్రాడ్‌ కాలి మడమ వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడినట్లు చెబుతున్నారు. గాయం కాస్త తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. తీవ్రమైన నొప్పి కారణంగా అతడు లేచి నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఇప్పటి వరకు బ్రాడ్‌ 149 టెస్టులు ఆడాడు. లార్డ్స్‌లో 150వ మ్యాచ్‌ ఆడేవాడు. మరి బ్రాడ్ 
ఈ టెస్టు ఆడతాడా లేడా అన్నది బుధవారం సాయంత్రం తెలియనుంది. గాయం తీవ్రంగా ఉందని, పూర్తి సిరీసుకు కూడా దూరమయ్యే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.


AlsoRead:  Ind vs Eng: భారత్‌తో రెండో టెస్టు... మొయిన్ అలీకి పిలుపు


AlsoRead: IPL 2021: చెన్నైకి ధోనీ... త్వరలో UAEకి... పర్మిషన్ కోసం వెయిటింగ్