దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నయనతార. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న వారి నయన్ ముందంజలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన 'నెట్రికన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13 నుండి డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది నయన్.
ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొంది ఈ బ్యూటీ. తొలిసారి ఈ షోలో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడింది. నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఎప్పుడూ నయన్ తన ప్రేమ సంగతుల గురించి చెప్పింది లేదు. కానీ విఘ్నేష్ మాత్రం నయన్ గురించి మాట్లాడుతుంటాడు.
మొన్నామధ్య సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు విఘ్నేష్ ను పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని.. దానికోసమే డబ్బులు దాచుకుంటున్నట్లు చెప్పాడు విఘ్నేష్. రీసెంట్ గా నయనతార ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఓ ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నయనతార తన చేతికున్న రింగ్ ను చూపిస్తూ.. 'ఇదే ఎంగేజ్మెంట్ రింగ్' అంటూ నవ్వుతూ చెప్పింది. తొలిసారి నయన్ తన రిలేషన్ గురించి స్పందించడంతో ఇప్పుడు కోలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది.
మొదట హీరో శింబుతో ప్రేమాయణం నడిపించిన నయనతార ఆ తరువాత అతడితో విడిపోయింది. కొన్నాళ్ల తరువాత ప్రభుదేవాను ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అందుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు విఘ్నేష్ ని ప్రేమిస్తుంది నయన్. ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.