తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం (ఆగస్టు 11న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని, ఒకటి రెండు‌చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు.


ఆదివారం (ఆగస్టు 10న) రాత్రి సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 11న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వివరించారు.


తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ఇలా..
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణాన్ని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
                        
నేడు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఇవాళ (ఆగస్టు 11), రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.


రాయలసీమలో ఇలా..    
రాయలసీమలో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.