ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని కరోనా వైరస్‌ తెగ ఇబ్బంది పెడుతోంది! ఎంత కట్టుదిట్టంగా టోర్నీని నిర్వహిస్తున్నా ఏదో విధంగా వైరస్‌ బయో బుడగల్లోకి ప్రవేశిస్తోంది. సెమీఫైనల్‌ దశకు చేరుకున్న ఈ ఓపెన్‌లో తాజాగా ఒకరికి కొవిడ్‌ పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. 


రెండో సీడ్‌ రష్యన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆటగాడు రోడిన్‌ అలిమోవ్‌కు పాజిటివ్‌ వచ్చింది. దాంతో అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడి డబుల్స్‌ భాగస్వామి అలినా డవ్లెతోవా సైతం తప్పుకోంది. అతడితో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. రష్యా జోడీ నిష్క్రమించడంతో ఇండోనేషియాకు చెందిన యాంగ్‌ కై టెర్రీ హీ, వీ హన్‌ టాన్‌ ద్వయానికి వాకోవర్‌ లభించింది. వారు ఫైనల్‌ చేరుకున్నారు.







టోర్నీ ఆడుతున్న వారికి నిబంధనల ప్రకారం నిరంతరం కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చిన వారికి ఆర్‌టీ పీసీఆర్‌ చేయించి నిర్ధారిస్తున్నారు. ఇంతకు ముందూ టోర్నీలో ఏడుగురు షట్లర్లకు వైరస్‌ సోకింది. దాంతో వారు ఆడాల్సిన మ్యాచుల్లో ప్రత్యర్థులకు వాకోవర్‌ ఇస్తున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య తెలిపింది. దిల్లీలోని కేడీ జాదవ్‌ ఇండోర్‌ హాల్‌లో మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే.


భారత అమ్మాయిలు పీవీ సింధు, ఆకర్షి కష్యప్‌ సింగిల్స్‌లో సెమీస్‌కు చేరుకున్నారు. సుపనిద కేట్‌థాంగ్‌తో సింధు, బుసానన్‌ ఆంగ్‌బమృంగ్‌పన్‌తో ఆకర్షి తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీస్‌ చేరుకున్నాడు. ఈ మ్యాచులో ఎన్‌జీ జె యంగ్‌తో తలపడనున్నాడు. కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమించడంతో ఇక ఆశలన్నీ లక్ష్య మీదే ఉన్నాయి.


Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్‌ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ


Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!


Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే