వెస్టిండీస్‌పై వరుసగా రెండో క్లీన్‌స్వీప్‌పై టీమ్‌ఇండియా కన్నేసింది! ఆఖరిదైన మూడో టీ20లో గెలవాలని కోరుకుంటోంది. రెండో మ్యాచులో థ్రిల్లింగ్ విజయం ఆకట్టుకున్నా జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రిజర్వు బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లను పరీక్షించనున్నాడు. మరోవైపు విండీస్‌ ఈ నామమాత్రపు మ్యాచులోనైనా గెలిచి గౌరవంతో స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి!


బబుల్‌ వీడిన Virat Kohli, Rishabh Pant


కీలకమైన రెండో టీ20లో విజయం కోసం రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. రిషభ్ పంత్‌, విరాట్‌ కోహ్లీ అర్ధశతకాలకు తోడుగా వెంకటేశ్‌ అయ్యర్ (౩౩) విధ్వంసకరంగా ఆడటంతో టీమ్‌ఇండియా 186 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్‌ దడదడలాడించింది. నికోలస్‌ పూరన్‌, రోమన్‌ పావెల్‌ అర్ధశతకాలు బాదేశారు. దాదాపుగా గెలిచేలా కనిపించిన ఆ జట్టును ఆఖరి ఓవర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌ అడ్డుకున్నారు. ఇక మూడో టీ20లో రోహిత్‌ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.


జట్టులోకి Ruturaj Gaikwad, Shreyas Iyer 


నామమాత్రపు ఆఖరి మ్యాచుకు విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌ అందుబాటులో ఉండటం లేదు. వారిద్దరూ ఇప్పటికే ఈడెన్‌లో బబుల్‌ను విడిచేశారు. ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌కూ విశ్రాంతి ఇవ్వొచ్చు. అంటే రోహిత్‌ శర్మతో కలిసి రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓపెనింగ్‌ చేయొచ్చు. రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడ్డ ఇషాన్‌ కిషన్‌కు వికెట్‌ కీపర్‌గా అవకాశం దక్కుతుంది. అతడు బహుశా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావొచ్చు. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదో స్థానంలో వస్తారు. వెంకటేశ్‌ బదులు దీపక్‌ హుడాను తీసుకుంటే అతడు ఆరో స్థానంలో వస్తాడు.


బౌలింగ్‌ విభాగంలో పోటీ


బౌలింగ్‌లోనే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. హర్షల్‌ పటేల్‌కు చోటు గ్యారంటీ! శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లో ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుంది. రవి బిష్ణోయ్‌ ఎలాగూ ఆడతాడు. పనిభారం దృష్ట్యా భువీకి విశ్రాంతి ఇవ్వొచ్చు. అతడి స్థానానికి సిరాజ్‌, అవేశ్‌ ఖాన్‌ పోటీ పడుతున్నారు. యుజ్వేంద్ర చాహల్‌ బదులు కుల్‌దీప్‌ను ఆడించొచ్చు. లేదంటే బిష్ణోయ్‌కు విశ్రాంతి ఇచ్చి కుల్చా జోడీని ప్రయోగించే అవకాశం లేకపోలేదు.


India probable XI


భారత్‌ అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ / దీపక్‌ హుడా, హర్షల్‌ పటేల్,  భువీ / సిరాజ్‌ / అవేశ్‌ ఖాన్‌, దీపక్‌ చాహర్‌ / శార్దూల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ / చాహల్‌