వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ వెస్టిండీస్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. రిషబ్ పంత్ (52 నాటౌట్: 28 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (52: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.


టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (2: 10 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (19: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.


వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం చేజ్ టీమిండియాను పెద్ద దెబ్బ కొటాడు. తన మొదటి ఓవర్లో రోహిత్ శర్మను, రెండో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్‌ను (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసిన చేజ్... తన నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. అదే ఓవర్లో సిక్సర్‌తో విరాట్ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి టీమిండియా స్కోరు 13.4 ఓవర్లలో 106-4 మాత్రమే.


ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ (33: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్‌కు కేవలం 35 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా... రొమారియో షెపర్డ్, షెల్డన్ కాట్రెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బౌలర్లను ఉపయోగించడం విశేషం. 


Also Read: కోహ్లీ నీ తుది శ్వాస విడిచే వరకు ఈ గిఫ్ట్‌ నీవద్దే ఉంచుకో - సచిన్‌ భావోద్వేగం


Also Read: సన్‌రైజర్స్‌కు గంభీర్‌ దెబ్బ - మనీశ్‌ పాండే ఊచకోత మొదలైంది!