కృష్ణా జిల్లా విజయవాడ(Vijayawada)లో బ్యూటీషియన్ ముసుగులో గంజాయి(Ganja) దందా నడుపుతున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన బ్యూటీషియన్(Beautician) హలీమున్నీసా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటీషియన్ గా పని చేస్తూ చాటుమాటుగా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. హలీమున్నీసా బేగం భర్తతో విడిపోయి సాదిక్ అనే ప్రియుడితో సహజీవనం చేస్తుంది. సాదిక్ ను విజయవాడ పోలీసులు గంజాయి కేసులో అరెస్టు(Arrest) చేశారు. ప్రస్తుతం జైలుకి తరలించారు. అతన్ని విచారించిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. దర్యాప్తులో సాదిక్ హలీమున్నీసా పేరు వెల్లడించాడు. దీంతో హలీమున్నీసా నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 550 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్ధులు(Studnets) గంజాయితో పోలీసులకు చిక్కడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు ఏ విధంగా గంజాయి అందుతుందన్న కోణంలో విచారణ చేపట్టారు.


గంజాయి చెక్ పెట్టేందుకు 


ఏపీలో గంజాయి రవాణాకు పోలీసులు చెక్ పెడుతున్నారు. చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘాతో గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకుంటున్నారు. అయినా పోలీసులు కళ్లుగప్పి గంజాయిని సరిహద్దులు దాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గంజాయి సాగుచేస్తుంటారు. పోలీసుల కళ్లుగప్పి రవాణా చేస్తుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజన ప్రాంతాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేయడం, స్థానికులకు అవగాహన కల్పిస్తుంటారు. 


ఆపరేషన్ పరివర్తన్ 


దేశంలో ఎక్కడ గంజాయి లోడ్ దొరికినా అది విశాఖ మన్యం ప్రాంతం నుంచే వస్తోందని అక్కడి పోలీసులు ప్రకటించడం కామన్ అయిపోయింది. ఈ చెడ్డపేరును తుడిచేసుకోవడానికి ఏపీ పోలీసులు అసలు సమస్య మూలం మీదనే దృష్టి పెట్టారు. అసలు గంజాయి పంట పండించకుడా చేస్తే సమస్యే రాదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారు గత కొంత కాలంగా చేసిన ప్రయత్నాలతో  లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి మంట పెట్టి బుగ్గి చేశారు. గతేడాది నవంబర్ నుంచి ఈనెల వరకు పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐటీడీఏ అధికారులు కలిసి ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. మన్యంలో మరుమూల గ్రామాల్లో రైతులు పండిస్తున్న 8500 ఎకరాల్లోని గంజాయి పంటను ధ్వంసం చేశారు.  గంజాయి దాదాపు 2 లక్షల కిలోలు ఉంటుంది, దీని విలువ రూ.9250 కోట్ల వరకు ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి సమీపంలోని కోడూరు వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో గంజాయికి నిప్పు పెట్టారు. ఒడిశా లోని 23 జిల్లాలు విశాఖ గ్రామీణ ప్రాంతాలలోని 11 మండలాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది.  ఇప్పటికే 11 మండలాల పరిథి లోని 313 శివారు గ్రామాల్లోని 7552 ఎకరాల్లో 9251.32 కోట్ల విలువ చేసే గంజాయి సాగును నాశనం చేశారు.  


Also Read: వంద రెండు వందలు కాదు ఏకంగా రెండు లక్షల కేజీలు - గంజాయి కేసుల్లో ఏపీ పోలీసుల సంచలనం !