Dinesh Karthik Viral Video : టీమ్‌ఇండియా విమానంలో పొగలు! హీరోలా మారిన డీకే.. ఆ తర్వాత!

Dinesh Karthik Viral Video : విశాఖ మ్యాచు ముగిశాక బయల్దేరిన విమానంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. విమానంలో పొగలు వస్తుండగా దినేశ్‌ కార్తీక్‌ హీరో ఇజం చూపించాడు.

Continues below advertisement

Dinesh Karthik Viral Video : భారత్‌, దక్షిణాఫ్రికా ఐదు టీ20ల సిరీస్‌ పోటాపోటీగా సాగుతోంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తొలుత 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సఫారీల జోరును పంత్‌ సేన అడ్డుకుంది. విశాఖలో జరిగిన మూడో పోరులో 48 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ మ్యాచు ముగిశాక బయల్దేరిన విమానంలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది.

Continues below advertisement

Also Read: పాకెట్‌ డైనమైట్‌ బ్లాస్ట్! రాహుల్‌, కోహ్లీని దాటి టాప్-7కు ఇషాన్‌

విశాఖ నుంచి బయల్దేరిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు రాజ్‌ కోట్‌కు చేరుకున్నారు. స్థానిక హోటల్లో వీరికి సాదర స్వాగతం దక్కింది. అయితే విశాఖ నుంచి బయల్దేరిన విమానంలో ఓ సరదా సంఘటన అందరినీ ఆకట్టుకుంది. విమానంలో పొగలు వస్తుండగా అందులోంచి దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగా సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాం. చాన్నాళ్ల తర్వాత డీకే హీరోలా ఆడుతుండటంతో మిగతా వాళ్లు ఇలా ప్లాన్‌ చేసినట్టు అనిపిస్తోంది. అద్దిరిపోయే ఎంట్రీ ప్లాన్‌ చేసినందుకు డీకే అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. బీసీసీఐ పంచుకున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Also Read: టీమ్‌ఇండియాకు బ్యాడ్‌ న్యూస్‌! కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లాండ్‌కు వెళ్లడంపై సందిగ్ధం!

ఐర్లాండ్‌ పర్యటనలోనూ దినేశ్ కార్తీక్‌కు చోటు దక్కింది. రాబోయే ప్రపంచకప్‌నకు అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని టీమ్‌ఇండియా అనుకుంటోంది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు అతడెలాంటి ఫినిషింగ్స్‌ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఇక ఐర్లాండ్‌లో పర్యటించే టీమ్‌ఇండియాకు హార్దిక్‌ పాండ్యను బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రాహుల్‌ త్రిపాఠికి అవకాశం ఇచ్చింది. సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Continues below advertisement