Exclusive: రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన 'విక్రమ్' దర్శకుడు, విజయ్ సినిమా తర్వాత మెగా ప‌వ‌ర్‌స్టార్‌తోనే

'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా ఏంటి? దళపతి విజయ్ సినిమా. దాని తర్వాత? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో అని తెలిసింది.

Continues below advertisement

'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీద తెలుగు హీరోల కన్ను పడింది. అంతకు ముందు 'ఖైదీ' లాంటి సూపర్ హిట్ సినిమా తీసి ఉండటం... 'విక్రమ్'లో యాక్షన్ సీన్లు అద్భుతంగా తెరకెక్కించాడని పేరు రావడం... ముఖ్యంగా స్క్రీన్ ప్లేలో పాత కథలను కనెక్ట్ చేసిన తీరు తెలుగు సినిమా ప్రముఖులకూ నచ్చింది. అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారట.

Continues below advertisement

Lokesh Kanagaraj next after Thalapathy Vijay's movie is confirmed. It is with Ram Charan: 'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కానగరాజ్ ఒక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత చరణ్ సినిమా ఉంటుంది. మరో తెలుగు హీరోతో సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో లోకేష్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'విక్రమ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు రామ్ చరణ్‌తో లోకేష్ కనకరాజ్ సమావేశం అయ్యారని తెలిసింది. 'విక్రమ్' హిట్ అవ్వడం కంటే ముందే సినిమా చేయాలని డిస్కషన్స్ జరిగాయట. 'విక్రమ్' ఘన విజయం సాధించిన సందర్భంగా కమల్ హాసన్ అండ్ కోను ఇంటికి పిలిచి మరీ చిరంజీవి సన్మానించిన సంగతి తెలిసిందే.

Also Read: చెప్పులు వేసుకుని గుడికి వెళతారా? ఆ సీరియల్ వీఎఫ్ఎక్స్ ఏంటి? - 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ మనవడి క్యారెక్టర్ ఒకటి ఉంది. అతడు పెరిగి పెద్దయిన తర్వాత రామ్ చరణ్ అవుతాడని ఒక ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత? అనేది త్వరలో తెలుస్తుంది. విజయ్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అనేది పక్కా. 

Also Read: రష్మీ జీవితంలో అంతులేని విషాదం, ఆ లోటును తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు...

Continues below advertisement
Sponsored Links by Taboola