రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. హిందీ ప్రేక్షకులలో కొంత మందికి ట్రైలర్ నచ్చింది. మెజారిటీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. హిందుత్వ వాదులకు మాత్రం ఒక్క విషయం నచ్చలేదు. అది ఏంటంటే... చెప్పులు వేసుకుని రణ్‌బీర్ కపూర్ గుడికి వెళ్లడం!
Boycott Brahmastra Trends In Twitter: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్‌లో రెండు మూడు సన్నివేశాల్లో రణ్‌బీర్ గుడిలో ఉంటారు. అక్కడ ఆయన చెప్పులతో కనిపించడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. దాంతో 'బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర' అంటూ ట్వీట్లు చేస్తున్నారు. గుడికి చెప్పులతో వెళతారా? అని ప్రశ్నిస్తున్నారు.
Bramahstra is like Hindi Version of Nagarjuna's Damarukam, says Tollwyood Twitterati: తెలుగు ప్రేక్షకులు అయితే 'బ్రహ్మాస్త్ర'ను అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'డమరుకం'కు హిందీ వెర్షన్ అంటున్నారు. ఇంకొందరు చిరంజీవి 'అంజి' సినిమా గుర్తొచ్చిందని ట్వీట్లు చేస్తున్నారు. కొంత మంది అయితే ట్రైలర్‌లో గ్రాఫిక్స్ సీరియల్ గ్రాఫిక్స్ తరహాలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. అటు హిందీలో... ఇటు తెలుగులో... ఎటు చూసినా 'బ్రహ్మస్త్ర' మీద సెటైర్లు విపరీతంగా పడుతున్నాయి.
Also Read: అనుష్క మరోసారి తల్లి కాబోతుందా? సెకండ్ చైల్డ్ ప్లానింగ్‌లో విరుష్క జోడీ?
పురాణ, ఇతిహాసాల నేపథ్యంలో రూపొందుతోన్న 'బ్రహ్మాస్త్ర' మీద దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మూడు భాగాలుగా సినిమా తీయాలని ప్లాన్ చేశారు. దీని కోసమే ఆయన చాలా ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఒకవేళ 'బ్రహ్మాస్త్ర' ప్లాప్ అయితే రెండు, మూడు భాగాలు తీస్తారా? అని కొందరు ప్రశ్నిస్తుండటం విశేషం.
Also Read: రష్మీ జీవితంలో అంతులేని విషాదం, ఆ లోటును తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు...