Thaman On SSMB 28: రికార్డుల వేటలో - మహేష్ బాబు మూవీపై తమన్ అప్‌డేట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందే తాజా సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా ఆయన ఒక అప్‌డేట్‌ ఇచ్చారు.

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూటింగ్ కంటే ముందు చేయాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయా? -  ఇలా ఘట్టమనేని అభిమానులు మదిలో ఎన్నో ప్రశ్నలు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ (S Thaman) లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుతో ఆ ప్రశ్నలకు సమాధానం లభించినట్టు అయ్యింది.

Continues below advertisement

SSMB 28 Music Sittings Started: మహేష్ - త్రివిక్రమ్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పాటలు ఎలా ఉండాలి? ఏయే సందర్భాల్లో వస్తాయి? అనేది తమన్‌కు త్రివిక్రమ్ వివరిస్తున్నారు. ''మహేష్ గారు, త్రివిక్రమ్ గారితో సరికొత్త రికార్డుల క్రియేట్ చేయడానికి... మా ప్రయాణం మొదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమా'' అని తమన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. సో... త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేస్తున్నారన్నమాట.

Also Read: రష్మీ జీవితంలో అంతులేని విషాదం, ఆ లోటును తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు...

ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.

Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట

Mahesh Babu Fans Fires On Thaman In Twitter: ఇదిలా ఉంటే... మరోవైపు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తమన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు. 'సర్కారు వారి పాట' నేపథ్య సంగీతం బాలేదని, ఈసారి జాగ్రత్తగా చేయమని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'

Continues below advertisement