India vs New Zealand Match preview: భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టీమ్ ఇండియాకు ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్. నిజానికి ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే లక్నో వేదికగా జరిగే టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిందే.
లక్నో పిచ్ ఎలా ఉంది?
లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ ప్రతిసారీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తుంది. ఈ విజయాలన్నీ కొంత ఏకపక్షంగానే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ వికెట్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు పిచ్ నుంచి మరింత సహాయం అందుతున్నట్లు స్పష్టమైంది. అయితే రాత్రిపూట రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లను మంచు ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది అంత సులువు కాదు.
లక్నో వాతావరణం ఎలా ఉంది?
లక్నోలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఉష్ణోగ్రత 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. అయితే మ్యాచ్ జరిగే రోజు వర్షం కురిసే అవకాశం లేదు. ఇది అభిమానులకు గుడ్ న్యూస్. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తయ్యే అవకాశం ఉంది.
లక్నోలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
భారత జట్టు లక్నోలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. రెండు సార్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 190కు పైగా పరుగులు చేసింది. భారత్ ఇక్కడ శ్రీలంక, వెస్టిండీస్‌లను ఓడించింది.
1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్
టీ20 సిరీస్ భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ రాంచీలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డెవాన్ కాన్వే (52), డేరిల్ మిచెల్ (59) అర్ధ సెంచరీలతో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్‌లో కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ ప్రారంభంలో సుందర్ ప్రమాదకరంగా బౌలింగ్ చేసి పవర్ ప్లేలో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో అక్షర్ పటేల్‌ను దాటేశాడు. ఈ విషయంలో రవిచంద్రన్ అశ్విన్ 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్ బౌలర్లు
17 - రవిచంద్రన్ అశ్విన్
15 - వాషింగ్టన్ సుందర్
13 - అక్షర్ పటేల్