తొలిపోరులో అద్భుత విజయం అందుకున్న టీమ్‌ఇండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచులో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు హిట్‌మ్యాన్ సేనను ఓడించి 1-1తో ఆశలు నిలుపుకోవాలని కివీస్ అనుకుంటోంది. మరి రాంచీలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి!!
విరామం లేదు
ఈ సిరీసుకు సన్నద్ధం అయ్యేందుకు టీమ్‌ఇండియాకు కొంత సమయం దొరికింది. ముందుగానే దుబాయ్ నుంచి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంది. కుర్రాళ్లు, సీనియర్లు తాజాగా కనిపించారు. కెప్టెన్‌గా రోహిత్, కోచ్‌గా ద్రవిడ్ తమ ప్రస్థానం ఆరంభించడంతో కుర్రాళ్లు ఉత్సాహంగా కనిపించారు. గెలుపోటములను పక్కనపెట్టి ఫియర్‌లెస్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించారు. కివీస్ మాత్రం అలసటతో కనిపించింది. గత ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ ఆడి విరామమే లేకుండా టీమ్‌ఇండియాతో తొలి టీ20 ఆడింది. పైగా విలియమ్సన్ అందుబాటులో లేడు. రెండో టీ20కి ఆ జట్టుకు కాస్త విశ్రాంతి లభించే ఉంటుంది.
టీమ్‌ఇండియా బలాలు
- రోహిత్ ఓపెనింగ్ మెరుపులు.
- సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం.
- పంత్ పరిణతితో ఆడటం.
- భువీ బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడం.
- అశ్విన్, అక్షర్ జోడీ బంతితో మాయ చేయడం.
- వెంకటేశ్ అయ్యర్ రాకతో ఆరో బౌలింగ్ ఆప్షన్ దొరకడం
టీమ్‌ఇండియా బలహీనతలు
- మంచు కురిస్తే మెరుగ్గా బౌలింగ్ చేయకపోవడం.
- దీపక్ చాహర్, సిరాజ్ పరుగులు ఇవ్వడం.
- వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేయకపోవడం.
- కివీస్ బౌలర్లకు భారత బ్యాటర్ల బలహీనతలు తెలియడం.
పట్టుదలగా కివీస్
న్యూజిలాండ్ జట్టులో మార్టిన్ గప్తిల్ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్సన్ స్థానంలో వచ్చిన చాప్‌మన్ రాణించాడు. అయితే మిడిలార్డర్‌లో కొంత తడబాటు కనిపించింది. గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచులో అదరగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. రచిన్ రవీంద్ర, జిమ్మీ నీషమ్ బ్యాటు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. కివీస్ పేసర్లు తెలివిగా బంతులేస్తారు. ఇక్కడి పిచ్‌లు, భారత బ్యాటర్ల గురించి సౌథీ, బౌల్ట్‌కు బాగా తెలియడం అనకూల అంశం. టాడ్ ఆస్ట్లే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఏదేమైనా రాంచీలో టాస్ కీలకం కానుంది. ఛేదనలో మంచు కురిసే అవకాశం ఉంది.
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
Also Read: Ricky Ponting Update: ఐపీఎల్ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్ ఆఫర్.. ఎందుకు తిరస్కరించాడంటే?
Also Read: Ind vs NZ 2nd T20I: రెండో టీ20 వాయిదా పడుతుందా? ఏకంగా హైకోర్టులో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి