భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 128 ఓవర్లకు ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 27 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 180(321బంతులు, 18 ఫోర్లు) పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు భారత్ 126.1ఓవర్లకి 364 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 


AlsoRead: Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకి జ్వరం... కరోనా టెస్టు చేయించుకున్న నీరజ్... మరి రిజల్టేంటంటే?






Also Read: Kamran Akmal: నవ్వులపాలైన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్... Independence‌ని Indepenceగా రాసి


జో రూట్... మాస్టర్ ఇన్నింగ్స్


రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాస్టర్ ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 48తో బ్యాటింగ్ ప్రారంభించిన జో రూట్... తన జోరును ఎక్కడా తగ్గించలేదు. గతి తప్పిన బంతుల్ని తెలివిగా బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబట్టాడు. టీమిండియా బౌలర్లు రూట్‌ను ఔట్ చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అన్ని అస్త్రాలను ప్రయోగించారు. షార్ట్ పిచ్, బౌన్సర్లతో బౌలర్లు పరీక్షిస్తున్నా... వారిని సహనంతోనే ఎదుర్కొన్నాడు. లెగ్ సైడ్ బంతి వస్తే మాత్రం బౌండరీలు బాదాడు. 200 బంతుల్లో 9x4 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో జో రూట్‌కి ఇది 22వ టెస్టు శతకం. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా ఇది 11వ టెస్టు సెంచరీ. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా రూట్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. జానీ బెయిర్‌స్టో కలిసి నాలుగో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 


Also Read: IPL 2021: దుబాయ్‌కి వణక్కం... UAE చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్... కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వచ్చిన ధోనీ






 బెయిర్‌స్టో(57; 107 బంతుల్లో 7x4) అర్ధశతకంతో రాణించాడు. జో రూట్-బెయిర్ స్టో వీరిద్దరూ తొలి సెషన్‌లో భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వికెట్ పడకుండా లంచ్ విరామానికి వెళ్లారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో సిరాజ్‌ నాలుగు, ఇషాంత్‌ మూడు, షమికి రెండు వికెట్లు దక్కాయి.  


అభిమాని హల్‌చల్


మూడో రోజు లంచ్ విరామం తర్వాత మైదానంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. లంచ్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. ఆ సమయంలో ఓ అభిమాని టీమిండియా జెర్సీ ధరించి తాను మైదానంలోకి వచ్చాడు. వెంటనే గమనించిన మైదానం సిబ్బంది అతడ్ని బయటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు తాను టీమిండియా సభ్యుడినని, కావాలంటే జెర్సీ చూడండని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది ఆ అభిమానిని మైదానం వెలుపలికి తీసుకువెళ్లారు. దీంతో ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.