Indian Team New Jersey: టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. నీలం రంగులో ఉన్న ఆ జెర్సీ ఆకట్టుకునేలా ఉంది. జెర్సీ మీద బీసీసీఐ లోగో పైన 3 స్టార్స్ వేశారు. డ్రెస్ అంతా స్కై బ్లూ కలర్ లో ఉన్నా.. భుజాలు, చేతులపై నిండు నీలం రంగు వచ్చేలా డిజైన్ చేశారు. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్.. మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ తదితరులు కొత్త జెర్సీ ధరించి ఉన్న ఫొటోను బీసీసీఐ పంచుకుంది. 


ఆసీస్ తో సెప్టెంబర్ 20 నుంచి జరగనున్న టీ20 సిరీస్ నుంచి టీమిండియా కొత్త జెర్సీతో బరిలో దిగనుంది. టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే జెర్సీతో ఆడనున్నారు.


ఆసీస్ తో టీ20 సిరీస్


ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం భారత క్రికెటర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బ్యాటింగ్ లో ఆసియా కప్ లో కోహ్లీ తప్ప మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నారు. సూర్య కుమార్ లో నిలకడ లోపించింది. పంత్, పాండ్య అంచనాలకు తగ్గట్లు ఆడడంలేదు. ఇక బౌలింగ్ లో బుమ్రా, హర్షల్ పటేల్ ల చేరికతో బలంగానే కనిపిస్తోంది. వారికి తోడు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లు ఉన్నారు. స్పిన్ భారాన్ని అశ్విన్, చహాల్ మోయనున్నారు. రవీంద్ జడేజా స్థానంలో అక్షర్ పటేల్ స్పిన్  ఆల్ రౌండర్ పాత్ర పోషించనున్నాడు. 


టీ20 ప్రపంచకప్ సమీపంలోనే ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ భారత్ కు కీలకం కానుంది.


భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్.


ఆస్ట్రేలియా జట్టు


ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, జోష్ ఇగ్లిస్, గ్లెన్ మాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, డానియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, అడమ్ జంపా, మాథ్యూ వేడ్.