అనుకున్నదే జరిగింది! నమీబియాను అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది. తమ బౌలింగ్‌కు తిరుగులేదని చాటిచెప్పింది. గ్రూప్ 2లో పాక్ తర్వాత రెండో విజయం అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మొదట మహ్మద్ షెహజాద్ (45; 33 బంతుల్లో 3x4, 2x6), మహ్మద్ నబీ (32*; 17 బంతుల్లో 5x4, 1x6) అదరగొట్టడంతో అఫ్గాన్ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. నమీబియాలో డేవిడ్ వైస్ (26; 30 బంతుల్లో 2x4) ఒక్కడే రాణించాడు. నవీనుల్ హక్ (3), హమీద్ హసన్ (3), గుల్బదీన్ నయీమ్ (2) బౌలింగ్‌లో అదరగొట్టడంతో నమీబియా 20 ఓవర్లకు 98/9కి పరిమితం అయింది. అఫ్గాన్ 62 పరుగుల తేడాతో గెలిచింది.
దంచేశారు
మొదట అఫ్గాన్ సునాయాసంగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (33; 27 బంతుల్లో 4x4, 2x6), షెజాద్ దంచికొట్టడంతో పవర్‌ప్లేలో 50 పరుగులు వచ్చాయి. వీరిద్దరూ తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. 6.4వ బంతికి హజ్రతుల్లాను స్మిత్ ఔట్ చేశాడు. మరికాసేపటికే రహ్మతుల్లా గుర్జా్‌బ్ (4) పెవిలియన్ చేరాడు. దాంతో అస్ఘర్ అఫ్గాన్ (31; 23 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి షెజాద్ దుమ్మురేపాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 12.4వ బంతికి షెజాద్‌ను ట్రంపెల్‌మన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే నజీబుల్లా జర్దాన్ (7) పెవిలియన్ చేరాడు. కీలక సమయంలో అస్ఘర్‌తో కలిసి నబీ చితక్కొట్టాడు. అతడు ఏకంగా ఐదు బౌండరీలు, ఒక సిక్సర్ బాదేశాడు. జట్టు స్కోరు 148 వద్ద అస్ఘర్‌ను ట్రంపెల్‌మన్ ఔట్ చేసినా నబీ అఫ్గాన్ స్కోరును 160కి చేర్చాడు.
Also Read: T20 Worldcup 2021: విజయం కావాలా నాయనా.. ముందు ఇక్కడ గెలవాల్సిందే!
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి