ఈ అమెజాన్ సేల్‌లో ఐఫోన్ ఎక్స్ఆర్‌ను అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరకు ఈ ఫోన్ ఇంతవరకు సేల్‌కు రాలేదు. మంచి కెమెరా. అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.15 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఐఫోన్ ఎక్స్ఆర్ మీదనే కాకుండా ఇతర మోడళ్లపై కూడా మంచి ఆఫర్లే అందించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐఫోన్ ఎక్స్ఆర్ ధర, ఆఫర్లు
ఈ ఫోన్ అసలు ధర రూ.47,990 కాగా, ఈ సేల్‌లో రూ.32,999కే కొనేయవచ్చు. అంటే దీనిపై రూ.14,901 తగ్గింపును అందించారన్న మాట. దీంతోపాటు ఈ ఫోన్‌పై రూ.15,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందించారు. అయితే దీని విలువ పాత ఫోన్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంటే వడ్డీ లేకుండా నెలసరి వాయిదాల ద్వారా కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. అయితే ఈ దీపావళి సేల్ ముగియడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి కొనాలంటే త్వరపడాల్సిందే.
ఐఫోన్ ఎక్స్ఆర్ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు అందించారు. ఒక మీటర్ లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఇది ఉండగలదు. ఏ12 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ వైడ్ కెమెరాను అందించారు. పొర్‌ట్రెయిట్ మోడ్, పొర్‌ట్రెయిట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్, స్మార్ట్ హెచ్‌డీఆర్, 4కే వీడియో వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో కూడా పొర్‌ట్రెయిట్ మోడ్, పొర్‌ట్రెయిట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్, స్మార్ట్ హెచ్‌డీఆర్, 1080పీ వీడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. హోం స్క్రీన్, కొత్త యాప్ లైబ్రరీ, యాప్ క్లిప్స్ కూడా ఇందులో అందించారు. ఐవోఎస్ 14తో ఇది షిప్ అవుతుంది. ఐవోఎస్ 15కు దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.