సాధారణంగా ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అంటూ ఉంటారు. కానీ దుబాయ్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం ఇది ‘టాసెస్ విన్ మ్యాచెస్’లా మారిపోయింది. ఎందుకంటే ఈ వరల్డ్‌కప్ సూపర్ 12లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 10 మ్యాచ్‌ల్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, నమీబియా, ఆస్ట్రేలియా.. టాస్ గెలిచాకనే తమ మ్యాచ్‌లను గెలిచాయి. కేవలం బంగ్లాదేశ్ మాత్రమే టాస్ గెలిచాక కూడా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. బలాబలాల విషయంలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య ఎంతో తేడా ఉంది. ఇందువల్లే బంగ్లాదేశ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది.
ఛేజింగ్ ఈజీ అయిపోయింది
యూఏఈలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్ష్యాన్ని ఛేదించడం సులభం అయిపోయింది. దీంతో కెప్టెన్లు బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో 10 మ్యాచ్‌లు జరిగితే... ఇందులో తొమ్మిది సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.
పిచ్‌లు అర్థం కావడం లేదు
ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు పిచ్ ఎలా ఉంటుందో సరిగ్గా అర్థం కావడం లేదు. దీంతో వారు వేగంగా ఆడటానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో వికెట్లు పడితే ఒత్తిడిలో పరుగులు అస్సలు రావడం లేదు.
దీంతో మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు నమోదవుతున్నాయి. రెండో విడత బ్యాటింగ్‌కు దిగిన జట్లు ఆ తక్కువ స్కోర్లను సులువుగా ఛేదిస్తున్నాయి. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లకు పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో ఒక ఐడియా కూడా వస్తుంది. దీంతో ఛేజింగ్ మరింత ఈజీ అయిపోతుంది.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి