టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. సెమీస్ బరిలో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిందే.. అయితే స్కాట్లాండ్ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు దాదాపు షాకిచ్చినంత పని చేసింది కాబట్టి స్కాట్లాండ్‌ని తక్కువ అంచనా వేయకూడదు.
ఇక భారత్ విషయానికి వస్తే.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలం అయిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు.. ఆఫ్ఘనిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌కు దిగిన నలుగురు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. దీంతోపాటు బౌలర్లు కూడా బలమైన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెను కట్టడి చేశారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ గత మ్యాచ్‌తో ఫాంలోకి వచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 140 పరుగులు జోడించి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. అదే సమయంలో వారి తర్వాత వచ్చిన పంత్, పాండ్యా కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. వీరు నాలుగో వికెట్‌కు 22 బంతుల్లోనే 63 పరుగులు జోడించడంతో భారత్ 210 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వాత భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేసి కట్టడి చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి స్థానంలో జట్టులోకి వచ్చిన అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో తన విలువను ప్రదర్శించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు తీసుకున్నాడు.
అయితే భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడటంతో.. న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడు ఆరు పాయింట్లతో మన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది కాబట్టి.. విజయాలు కూడా భారీగానే సాధించాలి.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ