టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.


ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జేసన్ రాయ్, జోస్ బట్లర్ వేగవంతమైన ప్రారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 3.4 ఓవర్లలోనే 36 పరుగులు జోడించిన అనంతరం జోస్ బట్లర్ అవుటయ్యాడు. పవర్ ప్లే చివరి ఓవర్‌లో మరో ఓపెనర్ జేసన్ రాయ్ కూడా అవుటవ్వడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు మహ్మద్ షమీనే తీశాడు.


ఆ తర్వాత డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని రాహుల్ చాహర్ విడదీశాడు. ఇన్నింగ్స్  పదో ఓవర్లో డేవిడ్ మలన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది.


పది ఓవర్లు ముగిసిన అనంతరం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మరింత చెలరేగి ఆడారు. లియామ్ లివింగ్ స్టోన్‌తో చివర్లో మొయిన్ అలీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. చివరి పది ఓవర్లలో ఇంగ్లండ్ ఏకంగా 109 పరుగులు చేయడం విశేషం. ఇందులో చివరి ఐదు ఓవర్లలో చేసినవే 58 పరుగులు ఉన్నాయి.


భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. షమీ 40 పరుగులు, రాహుల్ చాహర్ 43 పరుగులు ఇచ్చారు. ఒక్క వికెట్ కూడా తీయకపోయినా.. అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా కూడా 26 పరుగులే ఇచ్చాడు.


Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్‌ గంభీర్‌


Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?


Also Read: ఐపీఎల్‌ ఫైనల్‌ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్‌ మహీంద్రా


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి