టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 2021, డిసెంబర్ నెలలో ఐసీసీ ప్లేయర్ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. అతడితో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ కూడా నామినేట్ అయ్యారు.
రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్‌కు న్యూజిలాండ్ సిరీసులో అవకాశం వచ్చింది. దీనిని అతడు రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. రెండు మ్యాచుల్లో 69 సగటుతో 276 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలూ ఉన్నాయి. ఇక ఇదే సిరీసులో అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత అందుకున్నాడు. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. మొత్తంగా ఆ టెస్టులో అతడు 14 వికెట్లు పడగొట్టాడు.
యాషెస్ సిరీసును కైవసం చేసుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కీలకంగా నిలిచాడు. అటు బంతి ఇటు బ్యాటుతో రాణించాడు. డిసెంబర్లో జరిగిన మూడు టెస్టుల్లో 117 పరుగులు చేశాడు. 19.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. యాషెస్‌లో తొలి టెస్టు తొలి బంతికే రోరీ బర్న్స్ వికెట్ తీసి ప్రత్యర్థి ఇంగ్లాండ్‌కు ప్రమాద సంకేతాలు పంపించాడు.
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!