యూరోప్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2021-22లో టీమిండియా ఒలంపిక్ విజేత బెల్జియంను చిత్తు చేసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లూ 3-3 స్కోరుతో సమంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో టీమిండియా 5-4తో విజయం సాధించింది. నిర్ణయాత్మక గోల్‌ను కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో టీమిండియాకు విజయం దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా టీమిండియా 27 పాయింట్లు సాధించింది.
మొదటి క్వార్టర్ ముగిసేసరికి రెండు జట్లూ గోల్స్ సాధించడంలో విఫలం అయ్యాయి. రెండో క్వార్టర్‌లో బెల్జియం, భారత్ చెరో గోల్ సాధించాయి. మూడో క్వార్టర్‌లో బెల్జియం మరో గోల్ సాధించడంతో 1-2తో ఆధిక్యం సాధించింది. నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే బెల్జియం మరో సాధించింది. దీంతో 1-3 ఆధిక్యంలోకి బెల్జియం దూసుకెళ్లింది.
ఈ దశలో బెల్జియం గెలవడం ఖాయం అనుకున్నా... టీమిండియా అద్బుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించి స్కోరును 3-3తో సమం చేసింది. అయితే పెనాల్టీ కార్నర్‌లో టీమిండియా 5-4 ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది.