బజాజ్ ఆటో లిమిటెడ్ రాజీవ్ బజాజ్ ఇతర కంపెనీలపై సెటైర్లు వేయడానికి ఏమాత్రం వెనకాడడు. బజాజ్ ఎలక్ట్రిక్ వెహికిల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆటోమోటివ్ రంగంలో ఉన్న మిగతా బ్రాండ్లపై ఇలాంటి సెటైర్లే వేశారు.


ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘ఎలక్ట్రిక్ అసెంబ్లీ లైన్‌ను రూపొందించడం పెద్ద కష్టమేం కాదు. డబ్బులున్న దద్దమ్మలు ఎవరైనా ఆ పని చేయగలరు.’ అన్నారు. ‘సగం నిర్మించిన ఫెసిలిటీలు, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లేని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల వారు నియమాలను సడలించారు.’ అని అభిప్రాయపడ్డారు.


ఆక్రుడిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఫెసిలిటీ ప్రారంభం అయింది. 6.5 ఎకరాల్లో ఈ ఫెసిలిటీని నిర్మించారు. ఏటా 5 లక్షల యూనిట్లను ఇక్కడ తయారు చేయనున్నారు. వారి ఉత్పత్తులకు సంబంధించిన డొమస్టిక్, ఎక్స్‌పోర్ట్ డిమాండ్‌లను అందుకోగల సామర్థ్యం ఈ ఫెసిలిటీకి ఉంది.


రాజీవ్ బజాజ్ ఈ ఫెసిలిటీ గురించి మాట్లాడుతూ ‘చేతక్ కోసం ఈ యూనిట్‌ను జూన్ కల్లా ప్రారంభించాలన్న తమ కమిట్‌మెంట్‌ను కంపెనీ నిలబెట్టుకుంది. భవిష్యత్తులో చేతక్‌ను ముందుకు తీసుకెళ్లడమే ఈ ఫెసిలిటీ ప్రధాన లక్ష్యం.’ అన్నారు.


‘చేతక్ అనేది అసలైన్ మేక్ ఇన్ ఇండియా సూపర్ స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మనసులను చేతక్ గెలుచుకుంది.’ అని పేర్కొన్నారు. చేతక్ ఎలక్ట్రిక్‌ను లాంచ్ చేసిన నాటి నుంచి 14 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా 16 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. దీని ధర రూ.1,47,775గా ఉంది. ఇది ఎక్స్-షోరూం ధర.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?