ఫార్ములా వన్ రేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టైటిల్ పోటీదారులుగా భావిస్తున్న లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్‌స్టప్పెన్ రేసు కార్లు ఢీకొన్నాయి. మాంజాలో ఆదివారం జరుగుతున్న ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘటన జరిగింది.
ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన హామిల్టన్ మరోసారి మెర్సిడెస్ రేసర్‌గా బరిలోకి దిగాడు. రెడ్ బుల్ ఛాంపియన్‌గా వెర్‌స్టప్పెన్ రేసులో పాల్గొన్నాడు. అయితే వీరి కార్లు ఢీకొన్నాయి. వెర్‌స్టప్పెన్ కారు పక్కకు దూసుకెళ్లి నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు రేసింగ్ కార్ల నుంచి బయటకు వచ్చారు. మెడికల్ టీమ్ వీరికి ఏమైనా జరిగిందా అని పరిశీలిస్తుంది.
Also Read: నా పళ్లు ఊడిపోయాయ్.. అందుకు కారణం అదేనా.. ఇంగ్లాండ్ మాజీలకు ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగే రిప్లై
రేసింగ్ కార్లు ఢీకొన్న ఘటనపై వెర్‌స్టప్పెన్ ఘాటుగానే స్పందించాడు. వేరే వాళ్లకు చోటు ఇవ్వకపోవడం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని స్థానిక రేడియోకు తెలిపాడు. వెర్‌స్టప్పెన్ గ్రాండ్ ప్రి ఐదు పాయింట్లతో ప్రారంభించాడు. శనివారం జరిగిన రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన హామిల్టన్ రెండు పాయింట్లు సాధించాడు.
నేడు జరిగిన రేస్‌లో వీరు గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మెక్‌లారెన్ రేసర్ డేనియల్ రికియార్డో చేతిలో డచ్‌కు చెందిన వెర్‌స్టప్పెన్ ఓడిపోయాడు. అతను 20 ల్యాప్‌లతో బ్రిటిష్ టీమ్ మేట్ లాండో నారిస్ కంటే ముందుగా రేసును ముగించాడు. మెక్‌లారెన్ లాండో నోరిస్‌ని 20 ల్యాప్‌లు మాత్రం గెలవలేకపోయాడు. మెక్‌లారెన్ 2012 నుండి ఒక్క ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి కూడా నెగ్గకపోవడం గమనార్హం.
Also Read: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 ఫేజ్-2.. ఈ 7 విషయాలు మీకు తెలుసా!
అంతకు ముందు వెర్‌స్టప్పెన్ రెండవ స్థానంలో రేసులో కొనసాగుతున్నాడు. దాంతో పిట్‌స్టాప్‌లో 11 సెకన్లు కోల్పోయాడు, దాంతో అతడి స్థానంలో 10కి వెళ్లిపోయింది. అదే సమయంలో హామిల్టన్ నారిస్‌ని అధిగమించాడు. మరోవైపు రికియార్డో అప్పటికే రేసులో దూసుకెళ్తున్నాడు. మూడు ల్యాప్‌లు పూర్తయిన తరువాత హామిల్టన్ వేగాన్ని పెంచాడు ఈ క్రమంలో వెర్‌స్టప్పెన్ కారును ఢీకొట్టాడు. దాంతో అతడి కారు గాల్లోకి లేచి అక్కడే ఆగిపోయింది.
Also Read: చరిత్ర సృష్టించిన ఎమ్మా రదుకాను... 18 ఏళ్లకే యూఎస్ గ్రాండ్ స్లామ్... ఫైనల్ లో వరుస సెట్లలో ఘన విజయం