Messi with Trophy:  లియోనెల్ మెస్సీ.... స్టార్ ఫుట్ బాలర్ అయిన ఇతని చిరకాల కోరిక ఫుట్ బాల్ ప్రపంచకప్ గెలుచుకోవడం. 35 ఏళ్ల మెస్సీ తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. మరెన్నో ట్రోఫీలను అందుకున్నాడు. ఇంకెన్నో అవార్డులను గెలుచుకున్నాడు. అయితే ప్రపంచకప్ గెలవడం తన కల అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాడు. ఏ ఆటగాడికైనా తన ఆటలో అత్యుత్తమం అనదగ్గ దాన్ని అందుకోవడమే  అతని లక్ష్యం అవుతుంది. అలానే మెస్సీకి కూడా ప్రపంచకప్పే తన లక్ష్యం. దాని కోసం ఎంతో శ్రమించాడు. కొన్నిసార్లు దాని దగ్గరగా వెళ్లాడు. అయితే మొన్నటివరకు తన లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. 


అయితే ఫిఫా ప్రపంచకప్ తో తన కలను నెరవేర్చుకున్నాడీ స్టార్ ప్లేయర్. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో ఫ్రాన్స్ ను, మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 4-2 తేడాతో ఓడించి ట్రోఫీని అందుకుంది. కప్ అందుకున్న సమయాన మెస్సీ ఎంతో మురిసిపోయాడు. ట్రోఫీని ముద్దు పెట్టుకుని పరవశించిపోయాడు. తన లైఫ్ టైమ్ కోరికను చేరుకున్నందుకు చాలా సంతోషించాడు.


 ఆ ట్రోఫీ తనకెంత అపురూపమో మరోసారి చూపించాడు మెస్సీ. నిద్రించే సమయంలో కూడా ప్రపంచకప్ ట్రోఫీని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలోనూ పంచుకున్నాడు. దానికి శుభ దినం అనే క్యాప్షన్ ను రాశాడు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు స్పందిస్తున్నారు. లైకులు, కామెంట్లు చేస్తున్నారు. 






ఫైనల్ లో ఉత్కంఠ పోరులో అర్జెంటీనాపై విజయం


ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో ఫ్రాన్స్ ను ఓడించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ... ఈ ప్రపంచకప్ టోర్నీలో తన అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ తన అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించాడు. గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు తన జట్టును తీసుకొచ్చాడు. ఇదే ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ అని ముందే ప్రకటించిన మెస్సీ.. తన కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ అయినా అందుకోవాలనే కసితో ఫైనల్లో ప్రాణం పెట్టి ఆడాడు. మ్యాచ్ సమయంలో ఒకటి, అదనపు సమయంలో మరొకటి, ఆఖర్లో పెనాల్టీ షూటౌట్లో మరొకటి ఇలా మొత్తం 3 గోల్స్ కొట్టి జట్టు కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అనంతరం ట్రోఫీని అందుకుని మురిసిపోయాడు.