Qatar Bans Beer Sales Football: మందుబాబులకు షాకింగ్ న్యూస్. ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచ్ లల్లో బీర్ అమ్మడం, తాగడం బంద్ అని ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభమయ్యే సమయంలో అతిథ్య దేశం ఖతార్ మెగా పుట్ బాల్ టోర్నమెంట్ మ్యాచ్ లు జరిగే 8 స్టేడియలలో, పరిసర ప్రాంతాల్లో బీర్ అమ్మకాలు, తాగడం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్ అనేది ఓ ఇస్లామిక్ దేశం. అక్కడ సహజంగానే మద్యం అమ్మకాలను అంగీకరించరు. 


ఫిఫా వరల్డ్ కప్ నకు ఆథిత్యమిస్తున్న దేశాలతో ఫిఫా చర్చలు జరిపిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది. ఫిఫా వరల్డ్ కప్ నకు 1986 నుంచి బుడ్వైజర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ బీర్ నిషేధం వల్ల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందనే వాదనలు ఉన్నాయి. ఫ్యాన్ జోన్స్, మ్యాచ్ లు జరిగే వేదికలకు సమీపంలో బీర్లు, మద్యం అమ్మకాలను నిషేధించారు. అయితే ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ యోచన, ఒప్పందాల సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ చివరి నిమిషంలో నిర్ణయాలతో బడ్వైజర్ కు అంతగా ప్రయోజనం ఉండదు.


బీర్ బంద్‌నకు కారణాలు
ఖతార్ లో మద్యం అమ్మకాలు, తాగడం ప్రోత్సహించరు. మద్యం అమ్మడం, మద్యం సేవించడం వారి మత విశ్వాసాలకు విరుద్ధం. అయితే నాన్ - ఆల్కహాలిక్ బడ్ జీరో అమ్మకాలపై అక్కడ ఎలాంటి నిషేధం లేదు. అన్ని స్టేడియాలల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.


ముందు అయిన ఒప్పందం
ఖతార్ ఆల్కహాల్ అమ్మకాల్ని నియంత్రిస్తుంది. ముందుగా ప్రముఖ బీర్ కంపెనీ, ఫిఫా అతి పెద్ద స్పాన్సర్ అయిన బడ్ వైజర్ కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఫ్యాన్ జోన్స్, మ్యాచ్ వేదికలల్లో బీర్ అమ్మకాలకు ఆమోదం తెలిపారు. కానీ పూర్తి నిషేధం విధించకముందు బడ్ వైజర్ తన స్టాల్ లను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. తాజా నిర్ణయంతో అతిథ్య దేశం ఖతార్ లో  ఫిఫా స్టేడియాలు, వాటి పరిసర ప్రాంతాలు మ్యాచ్ లకు వచ్చే అభిమానులందరికీ ఆహ్లాదకరమైన అనుభూతి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు అని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది.






ఫిఫా వరల్డ్ కప్
ఒక అరబ్ దేశంలో టోర్నీ నిర్వహించడం ఇదే తొలిసారి. ఆల్కాహాల్ అమ్మకాలకు అనుమతిస్తే స్టేడియం వద్ద గొడవలు జరగడం, స్థానికులకు సైతం సమస్యలు తలెత్తుతాయని భావించిన అధికారులు.. ఫ్యాన్ క్లబ్ ల వద్ద, స్టేడియాల పరిసరాల్లో మద్యం అమ్మకాలు నిషేధించారు. ఫిఫా 1904 లో ప్రారంభించారు. ఇది 1930 నుంచి పురుషుల వరల్డ్ కప్, 1991 నుంచి మహిళల వరల్డ్ కప్ నిర్వహిస్తుంది. అయితే  ఈ వరల్డ్ కప్ నకు 31 దేశాల నుంచి లక్షల్లో పుట్ బాల్ అభిమానులు తరలి రానున్నారు.


ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ ప్రపంచ కప్‌లో మహిళా అభిమానులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. దేశంలోని కఠినమైన చట్టాల ప్రకారం శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులను ధరిస్తే వారిని జైలులో వేసే అవకాశం ఉంది.


ఖతార్ దేశానికి చెందని మహిళలు 'అబాయా' అని పిలిచే సాంప్రదాయిక పొడవాటి నల్లని వస్త్రాన్ని ధరించాలని అధికారిక ఆదేశాలు ఏమీ లేవు. కానీ వారు తమ భుజాలు, మధ్యభాగం లేదా మోకాళ్లను బహిర్గతం చేసే దుస్తులకు దూరంగా ఉండాలి. ఫిఫా వెబ్‌సైట్‌లో కూడా ఇదే తెలిపారు. అభిమానులకు వారి ఇష్టానికి అనుగుణంగా దుస్తులు ధరించవచ్చు. కానీ ఖతార్ చట్టాలను గౌరవించాలి.