ఆదివారం ఖతార్‌లో జరిగిన గ్రూప్-E మ్యాచ్‌లో కోస్టారికా 1-0తో జపాన్‌ను ఓడించి ఫిఫా ప్రపంచకప్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం స్పెయిన్ చేతిలో 7-0తో పరాజయం పాలైన తర్వాత కోస్టారికాకు ఇది ఊరట కలిగించే విజయం ఇది.


81వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు కీషెర్ ఫుల్లర్ ఏకైక గోల్ చేశాడు. ఒక విజయం, ఒక ఓటమితో కోస్టా రికా గ్రూప్-E పాయింట్స్ టేబుల్‌లో జపాన్ వెనుక నంబర్ 3 స్థానంలో ఉంది. ఇప్పటివరకు మెగా ఈవెంట్‌లో ఆడిన ఏకైక మ్యాచ్‌లో స్పెయిన్ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కాగా బుధవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 1-2తో ఓడి గ్రూప్-E పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.


ఈరోజు ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లో మెక్సికోపై అర్జెంటీనా 2-0తో విజయం సాధించాడు. అర్జెంటీనా అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి పాలైంది. గ్రూప్-F మ్యాచ్‌ల్లో బెల్జియం వర్సెస్ మొరాకో, కెనడా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్‌లు జరగనున్నాయి.