ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022లో గ్రూప్ దశ ముగిసింది. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను ఈ దశలో చూశాం. సౌదీ అరేబియా, కామెరూన్ లాంటి చిన్న జట్లు కూడా అర్జెంటీనా, బ్రెజిల్‌లకు షాకిచ్చాయి. నవంబర్ 20వ తేదీన ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభం అయింది. మొత్తంగా 32 జట్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్నాయి. నేటి నుంచి రౌండ్ ఆఫ్ 16 పోటీలు జరగనున్నాయి.


ఫిపా వరల్డ్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు, అవి జరిగే సమయం


డిసెంబర్ 3వ తేదీ - నెదర్లాండ్స్ వర్సెస్ యూఎస్ఏ - రాత్రి 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 4వ తేదీ - అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రేలియా - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 4వ తేదీ - ఫ్రాన్స్ వర్సెస్ పోలండ్ - రాత్రి 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 5వ తేదీ - ఇంగ్లండ్ వర్సెస్ సెనెగల్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 5వ తేదీ - జపాన్ వర్సెస్ క్రొయేషియా - రాత్రి 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 6వ తేదీ - బ్రెజిల్ వర్సెస్ దక్షిణ కొరియా - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 6వ తేదీ - మొరాకో వర్సెస్ స్పెయిన్ - రాత్రి 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 7వ తేదీ - పోర్చుగల్ వర్సెస్ స్విట్జర్లాండ్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 9వ తేదీ - మొదటి క్వార్టర్ ఫైనల్ - రాత్రి 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 10వ తేదీ - రెండో క్వార్టర్ ఫైనల్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 10వ తేదీ - మూడో క్వార్టర్ ఫైనల్ - రాత్రి 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 11వ తేదీ - నాలుగో క్వార్టర్ ఫైనల్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 14వ తేదీ - మొదటి సెమీ ఫైనల్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 15వ తేదీ - రెండో సెమీ ఫైనల్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 18వ తేదీ - కాంస్య పతకం కోసం మ్యాచ్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
డిసెంబర్ 19వ తేదీ - ఫిఫా వరల్డ్ కప్ 2022 గ్రాండ్ ఫైనల్ - తెల్లవారు జామున 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)


మనదేశంలో ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన లైవ్ బ్రాడ్ కాస్ట్ రైట్స్ వయాకాం18 వద్ద ఉన్నాయి. స్పోర్ట్స్18, స్పోర్ట్స్18 హెచ్‌డీల్లో వీటిని లైవ్ చూడవచ్చు. ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమ్ చేయాలంటే మాత్రం జియోసినిమా యాప్ ఉండాల్సిందే.