FIFA WC 2022 Fixture: ఫిఫా వరల్డ్ కప్‌లో నేడు నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రెజిల్, పోర్చుగల్, ఉరుగ్వే, స్విట్జర్లాండ్ వంటి పెద్ద జట్లు బరిలోకి దిగనున్నాయి. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ సెర్బియాతో తలపడనుంది. అదే సమయంలో రెండుసార్లు ప్రపంచ కప్ విజేత ఉరుగ్వే జట్టు కొరియా రిపబ్లిక్‌తో తలపడనుంది. క్రిస్టియానో రొనాల్డోకు చెందిన పోర్చుగల్ ఘనాతో తలపడుతుంది. స్విట్జర్లాండ్ జట్టు కామెరూన్ సవాలును ఎదుర్కోనుంది.
1. స్విట్జర్లాండ్ వర్సెస్ కామెరూన్: ఫిఫా ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్, 38వ ర్యాంక్‌లో ఉన్న కామెరూన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అల్ జనోబ్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం ౩.౩౦ గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
2. ఉరుగ్వే వర్సెస్ కొరియా రిపబ్లిక్: ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి. ఉరుగ్వే ప్రస్తుతం FIFA ర్యాంకింగ్ 16లో ఉంటే.... రిపబ్లిక్ ఆఫ్ కొరియా 29వ FIFA ర్యాంక్ కలిగి ఉంది.
3. పోర్చుగల్ వర్సెస్ ఘనా: క్రిస్టియానో రొనాల్డో నేడు బరిలోకి దిగనున్నాడు. స్టార్-స్టడెడ్ పోర్చుగల్ జట్టు ఈసారి తన మొదటి ప్రపంచ కప్ కోసం చూస్తోంది. తమ తొలి మ్యాచ్ లో ఆఫ్రికా జట్టు ఘనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ స్టేడియం 974లో జరుగుతుంది. రాత్రి 9.30గంటలకు ఈ మ్యాచ్ చూడవచ్చు.
4. బ్రెజిల్ వర్సెస్ సెర్బియా: అత్యధికసార్లు ప్రపంచ కప్ గెలిచిన బ్రెజిల్ జట్టు నేటి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో ఫిఫా ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్న సెర్బియాతో తలపడనుంది. లుస్సైల్ స్టేడియంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ 12.30 గంటలకు ప్రారంభం కానుంది.
మ్యాచ్ ను ఎక్కడ చూడాలి?
ఫిఫా వరల్డ్ కప్ 2022 అన్ని మ్యాచ్లు స్పోర్ట్స్ 18 1, స్పోర్ట్స్ 18 1హెచ్డి ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ మ్యాచ్‌ల యొక్క లైవ్ స్ట్రీమింగ్‌ను జియో సినిమా యాప్‌లో కూడా చూడవచ్చు.