England vs Spain FIFA Womens World Cup 2023 Final: ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ మహిళల జట్టు 1-0తో ఇంగ్లాండ్‌ను ఓడించి తొలిసారిగా ఈ ట్రోఫీని గెలుచుకోగలిగింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను 23 ఏళ్ల ఓల్గా కార్మోనా సాధించింది. ఆట మొదటి అర్ధభాగంలో (29వ నిమిషం) ఈ గోల్ వచ్చింది. మ్యాచ్ ఫలితాన్ని ఈ గోల్ నిర్ణయించడంతో స్పెయిన్ తమ మొదటి ఫిఫా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
1991లో ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ కప్‌ను గెలుచుకున్న ఐదో జట్టుగా స్పెయిన్ నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, నార్వే, జపాన్ జట్లు ఇప్పటివరకు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఇప్పుడు స్పెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది.
సెమీఫైనల్లో 2-1 తేడాతో స్వీడన్ జట్టును ఓడించి స్పెయిన్ జట్టు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు చేరుకుంది. స్పెయిన్ ఫైనల్స్‌కు చేరుకోవడం కూడా ఇదే మొదటిసారి. అదే సమయంలో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను 3-1తో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. వారికి కూడా ఇదే మొదటి ఫిఫా ప్రపంచ కప్ 2023 ఫైనల్. కాబట్టి కొత్త ఛాంపియన్ కనిపించడం అనేది ముందే ఫిక్స్ అయిపోయింది.
ఇప్పటి వరకు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్‌ను అమెరికా అత్యధికంగా నాలుగు సార్లు గెలుచుకుంది. జర్మనీ రెండు సార్లు, నార్వే, జపాన్ ఒక్కోసారి గెలుచుకున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, స్పెయిన్ రెండింటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. అంతకుముందు 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మూడో స్థానంలో నిలిచింది.
మహిళల ప్రపంచ కప్ 2023లో స్పెయిన్ మహిళల జట్టు ప్రయాణాన్ని పరిశీలిస్తే వారు గ్రూప్ దశలో కోస్టారికా జట్టును 3-0తో ఓడించి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జాంబియా 5-0తో స్పెయిన్ చేతిలో ఓడింది. అలాగే జపాన్ చేతిలో 4-0 తేడాతో ఓటమిని కూడా చవిచూడాల్సి వచ్చింది.
సూపర్-16లో స్పెయిన్ 5-1తో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌ను స్పెయిన్ 2-1తో ఓడించింది. అనంతరం సెమీ ఫైనల్స్‌లో స్వీడన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు.
Also Read: విరాట్ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!
Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial