మహీ భాయ్‌.. యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో ఈ పేరు తెలియని క్రికెట్‌ ఫ్యాన్‌ అంటూ ఎవరూ ఉండరు. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన మిస్టర్‌ కూల్‌ ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన ధోని టీమిండియాలో మంచి ఫినిషర్‌గానూ రాణించాడు. ధోని ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించి రెండేళ్లు కావొస్తున్నా క్రేజ్‌ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.


టీమిండియా కెప్టెన్‌గా విజయాలు చవిచూసిన ధోని.. ఐపీఎల్‌లో సీఎస్‌కేను విజయపథంలో నడిపించాడు.. నడిపిస్తున్నాడు. అలాంటి ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఓ వెరైటీ సీన్‌ చోటు చేసుకుంది. తాజాగా జరిగిన బ్రెజిల్ వర్సెస్ సెర్బియా జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఎంఎస్ ధోనీ పేరు హోరెత్తింది.


చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఎంఎస్ ధోని జెర్సీ నంబర్ 7 మ్యాచ్ సమయంలో కనిపించింది. అతని జెర్సీ బ్రెజిల్‌కు మద్దతు ఇస్తున్న అభిమానుల చేతుల్లో కనిపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు భాగం కానప్పటికీ, ఈ టోర్నీకి భారతీయ అభిమానులు కూడా భాగమయ్యారు.


ఇందులో భాగంగా నాబీల్‌ అనే వ్యక్తి బ్రెజిల్‌కు సపోర్టుగా ఎల్లో జెర్సీ వేసుకోవడం సహా ధోని పేరిట ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జెర్సీని చేతబట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు.. ధోని.. ధోనీ అంటూ గట్టిగా కేకలు చిల్‌ అయ్యారు. ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన బ్రెజిల్‌కు శుభారంభం దక్కింది. సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 తేడాతో నెగ్గింది. ఈ విజయంతో వరల్డ్ కప్‌లో బ్రెజిల్ క్యాంపెయిన్ ప్రారంభం అవడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఈసారి కూడా వరల్డ్ కప్ తమ జట్టే గెలుస్తుందని ధీమాగా చెప్తున్నారు. సెర్బియాపై విజయం ఈ ప్రయాణంలో తొలి అడుగు అంటున్నారు.


ఐపీఎల్‌-2023 సీజన్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరుగనున్న మినీ వేలంలో పాల్గొనాలకున్న ఆటగాళ్లకు బీసీసీఐ డెడ్‌లైన్‌ విధించింది. వేలం బరిలో ఉండాలనుకే ఆటగాళ్లు డిసెంబర్‌ 15లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 15 సాయంత్రం 5 గంటలలోగా ఆటగాళ్లు తమ పేర్లను ఎన్‌రోల్‌ చేసుకోకపోతే, మినీ వేలానికి వారు అనర్హులని ప్రకటించింది.