సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రస్తుత స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్.. టాలీవుడ్ సినిమాలో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఈ మూవీలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.


తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. ఇక కీర్తిసురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా న్యూస్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ  భామ. అయితే తాజాగా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీపై తన అభిమానాన్ని చాటుకుంది కీర్తి. మెస్సీ జెర్సీ ధరించి మురిసిపోయింది కీర్తి సురేశ్‌. అయితే ఇది పాత ఫొటో అయినా ఫిఫా వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బాగా ట్రెండింగ్‌ అవుతోంది. 


మొన్నటికి మొన్న కీర్తి సురేష్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఓ యంగ్ బిజినెస్ మెన్‌ని కీర్తి పెళ్లి చేసుకుంటుందని, అతని ఫ్యామిలీ, కీర్తి సురేష్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి రిలేష్ ఉందన్న వార్త తెగ సర్క్యూలేట్‌ అయింది. దీంతో కీర్తి సురేష్‌కి, అతనికి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, దీంతో వచ్చే ఏడాది ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ వినిపించింది.


ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పెళ్లి వార్తపై, ఆమె సన్నిహితులు స్పందించారు. కీర్తి పెళ్లి వార్తలన్నీ ఫేక్ అని, ఎవరో కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని, పెళ్లి వార్తల్ని కొట్టిపడేశారు. ఇక ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది కీర్తి. ప్రస్తుతం ఆమె భోళాశంకర్‌ సినిమాలో మెగాస్టార్‌ చెల్లెలిగా కనిపించనుంది. వీటితో పాటు మామన్నన్‌, సైరన్‌ వంటి క్రేజీ ప్రాజెక్టులతోనూ బిజీబిజీగా ఉంటోంది.


తెలుగుతో పాటు, తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఖతార్‌లో జరుగుతున్న 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికుల హార్ట్‌బిట్‌ని అమాంతం పెంచుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మన ప్రాతినిథ్యం లేకున్నా ఇండియాలోనూ ఫిఫా వరల్డ్‌కప్‌కు సూపర్‌ క్రేజ్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్‌  ఆటగాడు లియోనల్ మెస్సీకి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్టార్‌ ఆటగాడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక మెస్సీని ఇష్టపడే సెలబ్రెటీస్‌ జాబితాలో కీర్తి సురేష్‌ వచ్చి చేరింది.