శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానున్నాయి. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో ఉన్న కీలక ఫీచర్‌ను శాంసంగ్ కూడా తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. అదే శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్.


దీని కోసం శాంసంగ్ ఇరీడియం కమ్యూనికేషన్స్‌తో చేతులు కలపనుందని తెలుస్తోంది. 66 లో ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇరీడియం కమ్యూనికేషన్స్ ప్రస్తుతం వాయిస్ కాలింగ్, డేటా కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. శాటిలైట్ కనెక్టివిటీ కోసం ఇరీడియం కమ్యూనికేషన్స్‌తో శాంసంగ్ రెండు సంవత్సరాల నుంచి పని చేస్తుంది.


ఐఫోన్ 14 సిరీస్‌లో శాటిలైట్ కనెక్టివిటీ కోసం యాపిల్ గ్లోబల్ స్టార్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో కొత్త ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. అల్ట్రా సోనిక్ టెక్నాలజీతో ఈ సెన్సార్ రానుందని వార్తలు వస్తున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్ 2023 ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రధాన హైలెట్‌గా ఉండనుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. షావోమీ 12టీ ప్రోలో ఉన్న 200 మెగాపిక్సెల్ సెన్సార్ కంటే ఎంతో మెరుగైన 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఈ ఫోన్‌లో ఉండనుందని అంచనా.


ఇక యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యాయి. ఇందులో శాటిలైట్ కనెక్టివిటీని అందించారు. వినియోగదారులకు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఇది ఉపయోగపడనుంది. సాధారణంగా మొబైల్ ఫోన్లు గ్రౌండ్ బేస్డ్ మొబైల్ నెట్‌వర్క్ టవర్లను ఉపయోగించుకుంటాయి.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?