భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొంతకాలం పాటు జట్టు ఎంపికలో తనను పరిగణనలోకి తీసుకోవద్దని సెలక్టర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ను సాధించడంపై తాను దృష్టి పెట్టానని సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. 2019లో వెన్నెముక సర్జరీ అనంతరం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడేటప్పుడు, భారత జట్టులో కూడా బౌలింగ్ వేయలేకపోతున్నాడు.
ఈఎస్‌పీన్‌క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాడు. దీంతో సెలక్టర్లను కాస్త సమయం కావాలని కోరాడు. టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యా కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే బౌలింగ్ చేశాడు. అయితే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. టోర్నీకి జట్టును ఎంపిక చేసేటప్పుడు హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేస్తాడని ప్రధాన సెలక్టర్ చేతన్ శర్మ తెలిపినా, హార్దిక్ అందులో విఫలం అయ్యాడు.
యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించారు. ఈ టోర్నీలో పాండ్యా ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. 2019 ఐపీఎల్‌లోనే అతను చివరిసారి బౌలింగ్ చేశాడు. 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో హార్దిక్ పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గానే ఆడాడు.
న్యూజిలాండ్‌తో మనదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేయలేదు. అయితే తర్వాత జరిగే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు పాల్గొంటుందా లేదా అన్న సంగతి తెలియరాలేదు. ఆఫ్రికా దేశాల్లో కరోనా వైరస్ ఒమ్రికాన్ వేరియంట్ ప్రభావం చూపిస్తుండటంతో ఈ టోర్నీ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
దీంతోపాటు హార్దిక్ పాండ్యాను పూర్తిస్థాయి బ్యాటర్‌గా జట్టులోకి తీసుకోవాలని చర్చలు నడుస్తున్నాయి. విరాట్ కోహ్లీ తనను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకోవాలనుకుంటున్నాడు. ‘ఆరోస్థానంలో తనలా ఆడే వారిని ఓవర్‌నైట్‌లో తయారు చేయలేం’ అని కోహ్లీ గతంలో ఒకసారి అన్నాడు.
‘నంబర్ 6 బ్యాటర్‌గా తను ఎంత విలువైనవాడో మాకు తెలుసు. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ప్రత్యేకించి టీ20 క్రికెట్‌లో ఇలాంటి ఆటగాడు జట్టులో ఉండటం చాలా ముఖ్యం. కీలకమైన దశలో ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడగలడు. వికెట్లు త్వరగా పడినా, ఎక్కువ సేపు ఆడగల సామర్థ్యం ఉంది. ఇప్పుడు తనని బౌలింగ్ చేయమని బలవంతం చేయడం కూడా మంచిది కాదు.’ అని కోహ్లీ అన్నాడు.
Also Read: IND vs NZ Kanpur Test: యాష్ నువ్వే భేష్..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ
Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి