లీడ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ని మొదటి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకి భారత్ ఆలౌట్ చేసింది. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 423/8తో బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టుని 15 నిమిషాల వ్యవధిలోనే టీమిండియా ఔట్ చేసింది.
Also Read: IPL 2021: కోల్‌కతాకు కమిన్స్ స్థానంలో సౌథీ, పంజాబ్‌కు రిచర్డ్‌సన్ స్థానంలో అదిల్ రషీద్
బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 24తో బ్యాటింగ్ కొనసాగించిన ఓవర్టన్ (32: 42 బంతుల్లో 6x4) షమి వేసిన మొదటి ఓవర్లో ఫోర్లు కొట్టాడు.
ఆ తర్వాత షమి బౌలింగ్లోనే ఓవర్టన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రాబిన్సన్... బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత బౌలర్లలో షమి 4, బుమ్రా, సిరాజ్, జడేజాకి తలో రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లాండ్ టీమ్‌లో కెప్టెన్ జో రూట్ (121) శతకంతో చెలరేగాడు. డేవిడ్ మలాన్ (70) ఓపెనర్లు రోరీ బర్న్స్ (61), హమీద్ (68) రాణించారు.
Also Read: IPL 2021: కోహ్లీ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్... కెన్ రిచర్డ్‌సన్ స్థానంలో జార్జ్ గార్టన్
టీమ్‌ఇండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేసింది.