కోహ్లీ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ వచ్చి చేరాడు. సెప్టెంబర్ 19 నుంచి ఈ ఏడాది IPL - 2021 మిగతా సీజన్ ప్రారంభంకాబోతుందది. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు IPL కి దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయా ఫ్రాంఛైజీలు ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి.
మరో పక్క కొన్ని జట్లు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే UAE చేరుకున్నాయి. క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్లు కూడా ప్రారంభించాయి. కోహ్లీ నాయకత్వం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తాజాగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జార్జ్ గార్టన్‌తో ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రేలియన్ పేసర్ కెన్ రిచర్డ్‌సన్ స్థానంలో జార్జ్ గార్టన్‌ని తీసుకుంది. ఈ విషయాన్ని RCB ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
గార్టన్ ఇంకా ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టలేదు. కానీ, దేశవాళీ క్రికెట్లో మాత్రం అతడి ప్రదర్శన అద్భుతం. 38 టీ20లు ఆడిన అతడు 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బంతితోనే కాదు బ్యాట్‌తోనూ అతడి ప్రదర్శన మెరుగ్గానే ఉంది. T20ల్లో అతడి స్టైక్ రేట్ 124.66.
RCB ఇప్పటికే నాలుగు మార్పులు చేసింది. సెకండ్ సీజన్‌కి ఆస్ట్రేలియా క్రికెటర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు IPLలో కోహ్లీ సేన ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. IPL - 14వ సీజన్లో 7 మ్యాచ్²లు ఆడిన RCB ఐదింట్లో విజయం సాధించింది. సెప్టెంబరు 20న RCB... కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.