భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తనకు కవల పిల్లలు పుట్టారని, ఇద్దరూ మగ పిల్లలే అని కార్తీక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. భార్య దీపికా పల్లికల్, ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను అతను పోస్ట్ చేశాడు. ఈ పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు.


దీనికి క్యాప్షన్‌గా దినేష్ కార్తీక్ ‘ముగ్గురం.. ఐదుగురం అయ్యాం’ అని రాశాడు. ఇక్కడ తాము పెంచుకునే కుక్కను కూడా దినేష్ కార్తీక్ కుటుంబంలో కలిపిచెప్పాడు. దీనికి శుభాకాంక్షలు చెబుతూ వసీం జాఫర్ ‘ఒక నిజమైన బ్యాట్స్‌మెన్ తరహాలో డీకే సింగిల్‌ను డబుల్‌గా కన్వర్ట్ చేశాడు. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. పిల్లలకు ఎంతో ప్రేమ, ఆశీస్సులు’ అంటూ ట్వీట్ చేశాడు.


దినేష్ కార్తీక్, దీపికా పల్లికల్‌లకు 2015లో వివాహం జరిగింది. దేశంలో ప్రముఖ స్క్వాష్ ప్లేయర్లలో దీపికా పల్లికల్ కూడా ఒకరు. 2006లో దీపికా పల్లికల్ ప్రొఫెషనల్ స్క్వాష్‌లోకి అరంగేట్రం చేసింది. ప్రపంచంలో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ మహిళల ర్యాంకింగ్స్‌లోకి టాప్-10లోకి చేరిన ఏకైక భారతీయురాలు దీపికానే.


ఇక క్రికెట్ విషయానికి వస్తే.. దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కోల్‌కతా ఓటమి పాలైంది. మార్చిలో జరిగిన ఇంగ్లండ్ టూర్‌లో దినేష్ కార్తీక్ కామెంటేటర్ అవతారం కూడా ఎత్తాడు.


ఐసీసీ ఆన్ గ్రౌండ్ కామెంటరీ ప్యానెల్‌లో ఉన్న ఇద్దరు భారతీయుల్లో దినేష్ కార్తీక్ కూడా ఒకడు. మాజీ టీమిండియా కెప్టెన్, వెటరన్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి దినేష్ కార్తీక్ కామెంటరీని అందించాడు. ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ కొన్ని జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొదట్లో అతను ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు కూడా ఆడాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్నాడు.


Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?


Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?


Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి