ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,896 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 381 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఒక్కరు కోవిడ్ తో మరణించారు. దీంతో కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 14,365కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 414 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,46,127 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 4,743 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలో 4,743 యాక్టివ్ కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235కి చేరింది. వీరిలో 20,46,127 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 414 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,365కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,94,04,281 నమూనాలను పరీక్షించారు.
నవంబర్ 30 వరకు కొవిడ్ నిబంధనలు పొడిగింపు
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో నిబంధలనలు అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు. కొవిడ్ -19 సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉంచాలని ఆ లేఖలో సూచించారు.
కేంద్రం ఆదేశాలు
కొవిడ్-19 కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా స్థానిక, జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను భల్లా కోరారు. కొవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని లేదని లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 28న కొవిడ్ మార్గదర్శకాలను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. గడువు ముగుస్తుండటంతో మరో నెలరోజుల పాటు పొడిగించింది.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి