బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఢిల్లీ సారథి మెగ్‌లానింగ్ 41 బంతుల్లో 55 పరుగులు చేసింది. అలీస్ క్యాప్సీ 17 బంతుల్లోనే 27 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 9 బంతులే ఆడినా ఓ సిక్సర్, ఓ బౌండరీ సాయంతో 13 పరుగులు చేసి ఔట్ అయింది. వన్ డౌన్‌లో వచ్చిన అలీస్ క్యాప్సీ ఆ ఊపును కొనసాగించింది. కెప్టెన్ మెగ్‌లానింగ్ కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు పరుగులెత్తింది. వీరి దూకుడుతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మేఘనా సింగ్ మూడు (4/37) వికెట్లు పడగొట్టింది. కీలక బ్యాటర్లు అంతా వెనుదిరిగినా అన్నాబెల్ సదర్లండ్ (12 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడింది. ఆఖర్లో శిఖా పాండే 8 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు) రెండు బౌండరీలు బాది ఢిల్లీ స్కోరును 160 దాటించింది.
ఛేదనలో తడబాటు
164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అష్లే గార్డెనర్ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్ తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది.
రెండో స్థానంలో ముంబై
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)ను చిత్తుగా ఓడించిన ముంబై రెండో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. బెంగళూరు బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన 9, సోఫి డెవిన్ 9 తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఇతెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన కూడా 11 పరుగులకే పెవిలియన్ చేరింది. కానీ ఎలిస్ పేర్రి జట్టును ఆదుకుంది. 44 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరుకు ఆ మాత్రం సోరైనా అందించింది. జార్జియా వేర్‌హామ్ కూడా 27 పరుగులతో పర్వాలేదనిపించింది. ముంబయి బౌలర్లలో నాట్ స్కివర్, పూజా వస్త్రాకర్ చెరో రెండు.. ఇస్సీ వాంగ్, సైకా ఇషాక్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. తర్వాత బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటింగ్‌లో యాస్తికా భాటియా 31, మ్యాథ్యూస్ 26, నాట్ స్కివర్ 27, అమేలియా ఖేర్ 40 రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫి డెవిన్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంకా పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. ఈగెలుపుతో ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబయి మూడింటిలో నెగ్గి 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.