ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిలో ఒకరిద్దరు మినహా అందరు భాగస్వాములే. అయినప్పటికీ వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లే అనుహ్యమైన మార్పులు చేసింది సెలక్షన్ కమిటీ. ముఖ్యంహగా పుజారాను, ఉమేష్ యాదవ్‌ను తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. 


బీసీసీఐ సెలక్టర్లు వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియా జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ టూర్‌లో విండీస్‌తో రెండు టెస్టులు ఆడబోతోంది టీమిండియా. ఈ రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో 35 ఏళ్లు నిండిన ఉమేష్‌ యాదవ్, పుజారాను తప్పించారు. వారి స్థానంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సీమర్ ముఖేష్ కుమార్‌కు చోటు దక్కింది. 


ముందు ముందు ఆసియాకప్‌, వరల్డ్ కప్‌ ఉన్నందున 32 ఏళ్ల పేసర్ మహ్మద్ షమీకి  రెస్ట్ ఇచ్చారు. టెస్ట్‌, వన్డే రెండింటిలోనూ అతన్ని ఎంపిక చేయలేదు. కానీ ఉమేష్‌, పుజాను తొలగించడం మాత్రం వివాదం అవుతోంది. ఉమేష్ స్థానంలో తీసుకున్న ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ 2021 నుంచి ఇప్పటి వరకు భారత్‌ తరుఫున టెస్టు ఆడింది లేదు. గత సీజన్‌ రంజీ ట్రోఫీలో కూడా ఆడలేదు. ఇరానీ కప్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతే తప్ప ఈ మధ్య కాలంలో ఆయన ఆడింది పెద్దగా లేదు. 


పుజారాపై వేటు వేసిన సెలక్షన్ కమిటీ... రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా ఆడిన డ్యాషింగ్ బ్యాట్సర్‌ జైస్వాల్‌కు స్థానం కల్పించారు. అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వివాహం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగి మ్యాచ్‌లలో ఆడలేకపోయిన  మహారాష్ట్రకు చెందిన గైక్వాడ్, 38 ఫస్ట్‌క్లాస్ గేమ్‌లలో 149 వికెట్లు పడగొట్టిన బెంగాల్‌కు చెందిన ముఖేష్‌పై సెలక్షన్ కమిటీ విశ్వాసం ఉంచింది. WTC ఫైనల్‌లో సరిగా ఆడలేకపోయిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై కూడా వేటు పడింది. ఆ మ్యాచ్‌లో అంతగా ఆకట్టులేకపోయిన ఆంధ్ర వికెట్‌కీపర్ కేఎస్‌ భరత్ మాత్రంపై మరోసారి నమ్మకం ఉంచారు. 


మంచి ఫామ్‌లో ఉన్న ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌ను విస్మరించడం కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అతను ఫస్ట్-క్లాస్ గేమ్‌ల్లో రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో అద్భుతంగా రాణించాడు. 


WTC ఫైనల్‌లో పుజారా, ఉమేష్ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా ఔట్ అయిన తీరుపై తీవ్ర విమర్శల పాలైంది. అయితే ఈ మధ్య కాలంలో విఫలమవుతున్న ఆటగాళ్ల విషయాన్ని చాలా మంది సీనియర్లు ప్రస్తావిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటి మ్యాచ్‌లో15 & 43 పరుగులు మాత్రమే చేశాడు. స్టార్ బ్యాట్ విరాట్ కోహ్లీ 14 & 49 పరుగులే చేశాడు. అయిన వారిని వెస్టిండీస్‌ జట్టులోకి తీసుకొని పుజారా, ఉమేష్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు విస్తున్నాయి.


విండీస్‌ టూర్‌కు వేటు పడిన పుజారా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ దులీప్‌ ట్రోఫీలో ఆడనున్నారు. వెస్ట్ జోన్ జట్టు తరఫున యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌ స్థానంలో ఆడతారు. జూలై 5 నుంచి దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తొలి మ్యాచ్ ఆడనుంది.


కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ పెద్ద ఆటగాళ్లు వీరిలో ఒకర్ని డ్రాప్ చేసినా అన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై రచ్చ రచ్చ అవుతుందని అంటున్నారు. అందుకే టెస్టు స్పెషలిస్టు అనే ముద్రవేసి పుజారాను తప్పించారనే విమర్శ ఉంది. అతనిపై వేటు వేస్తే ఒకరిద్దురు మాట్లాడతారే తప్ప సమస్యలు ఉండవి భావించి ఉండొచ్చని ఆరోపణ ఉన్నాయి. పుజారా ఇలాంటి సమస్య గతంలో కూడా ఎదుర్కొన్నాడని మళ్లీ జట్టులోకి వస్తాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన కేరీర్‌కు ఎలాంటిప్రమాదం లేదని వాదించేవాళ్లు ఉన్నారు. 


విండీస్‌తో మొదటి టెస్టు డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో జూలై 12న ప్రారంభం కానుంది. రెండో టెస్టు జూలై 20న పోర్టోఫ్-స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో మొదలు కానుంది. టెస్టుల తర్వాత మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా. టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడబోతోంది. ఆ టీంను త్వరలోనే ప్రకటించనున్నారు. 


భారత టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ (కె), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్‌, యశస్వీ జైశ్వాల్‌, కేఎస్ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌, నవదీప్‌ సైనీ


భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ (వి), ఇషాన్‌ కిషన్‌ (వి), హార్దిక్‌ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌