IND vs BAN 2nd Test Live Update:
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు! బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న అతడిని కవ్వించడమే ఇందుకు కారణం. గొడవ పెరిగేలా కనిపించడంతో అంపైర్లు, బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లారు.
విజయం సాధించాలంటే 100 పరుగులు చేయాలి
మీర్పూరు టెస్టులో టీమ్‌ఇండియా ప్రదర్శన ఘోరంగా ఉంది. 145 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ తక్కువ స్కోర్లకే టాప్ ఆర్డర్ వికెట్లు చేజార్చుకుంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 23 ఓవర్లకు 45/4తో నిలిచింది. అక్షర్ పటేల్ (26 బ్యాటింగ్), జయదేవ్ ఉనద్కత్ (3 బ్యాటింగ్) అజేయంగా నిలిచారు. మెహదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. షకిబ్‌కు ఒక వికెట్ దక్కింది. విజయం సాధించాలంటే టీమ్‌ఇండియా 100 పరుగులు చేయాలి.
ఇబ్బంది పడ్డ కింగ్ కోహ్లీ !
మూడో రోజు విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ 4 క్యాచులు జారవిడిచాడు. రెండో ఇన్నింగ్సులో 22 బంతులాడి ఒక పరుగు (Virat Kohli looks unhappy after getting out) చేశాడు. బంగ్లా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. మెహదీ హసన్ వేసిన ఓ డెలివరీని ఆడబోయిన విరాట్ షార్ట్ లెగ్‌లో మోమినల్ హఖ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఔటవ్వడంతో చిరాకు పడ్డ కింగ్ ఆవేశంగా పెవిలియన్ వైపు సాగాడు. అదే సమయంలో తైజుల్ ఇస్లామ్ ఏదో అనడం విన్నాడు. మరు క్షణమే ఆవేశంగా బదులిచ్చాడు. దాంతో షకిబ్ అల్ హసన్, అంపైర్లు కలగజేసుకొని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. కోహ్లీ వెళ్లాక తైజుల్‌తో షకిబ్ మాట్లాడాడు.
అంతకు ముందే తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో కోహ్లీ (Virat Kohli) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. బౌలర్ వేసిన బంతిని ఆడేందుకు ముందుకొచ్చాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి ప్యాడ్లకు తాకింది. అంపైర్ దానిని ఎల్బీడబ్ల్యూగా ఇవ్వడంతో విరాట్ సహనం కోల్పోయాడు. వెంటనే సమీక్ష కోరి బయపడ్డాడు. బహుశా విరాట్, తైజుల్ వాగ్వాదానికి ఈ సంఘటనే ఆజ్యం పోసి ఉండొచ్చు.