David Warner Out: రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వైజాగ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడనుంది. 5 టీ20ల సిరీస్‌కు రెండు రోజుల క్రితమే జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఆసీస్, భారత్ తొలి టీ20లో తలపడనున్నాయి. మొదటి 3 మ్యాచ్‌లకు రుతురాజ్ వైస్ కెప్టెన్‌కాగా, చివరి 2 టీ20లకు శ్రేయస్ అయ్యర్ యాడ్ అవుతాడు. అప్పుడు ఆయనే డిప్యూటీగా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది.
ఆసీస్ తో టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా..
1. నవంబర్ 23 - 1వ T20, విశాఖపట్నం
2. నవంబర్ 26 - 2వ టీ20, తిరువనంతపురం
3. నవంబర్ 28 - 3వ T20, గువాహటి
4. డిసెంబర్ 1 - 4వ టీ20, రాయ్ పూర్
5. డిసెంబర్ 3 - 5వ టీ20, బెంగళూరు
ఈ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు 15 మంది సభ్యులతో జట్టును ఇప్పటికే ప్రకటించింది. అయితే అందులో కీలక మార్పులు చేసింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. వార్నర్ కు రెస్ట్ కల్పించింది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాను కంటిన్యూ చేస్తోంది. భారత జట్టులో వరల్డ్ కప్ ఆడిన వారిలో కొందరే ఈ సిరీస్ ఆడనుండగా.. ఆసిస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. వరల్డ్‌కప్ కెప్టెన్ కమ్మిన్స్‌తో పాటు వార్నర్, మిచెల్ స్టార్క్, హేజల్‌వుడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌కు విశ్రాంతి ఇచ్చింది ఆసీస్ మేనేజ్ మెంట్.
వార్నర్ స్థానంలో ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీని ఎంపిక చేశారు. త్వరలో పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు వార్నర్. కొంతకాలంగా వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తన పని అయిపోయిదన్న వారు ఎవరని ప్రశ్నించారు.
టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.