Kohli News: ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద యెత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఏ దేశానికైనా భారత జట్టు టూర్‌కి వెళ్తుందంటే కింగ్ కోహ్లీ వస్తున్నాడని అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది. నిర్వాహకులు కూడా కోహ్లీ వస్తున్నాడని టికెట్లు అమ్మడానికి ట్రై చేస్తుంటారు. ఆ మేరకు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఇక దేశంలో బయట చాలా అరుదుగా కోహ్లీ సంచరిస్తుంటాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఇండియాకు చేరుకున్న విరాట్.. తన ఫ్యామిలీతో కలిసి జాలీగా గడుపుతున్నాడు. ఇప్పటికే యూపీలోని వృందావన్‌లో ఉన్న స్వామి ప్రేమానంద్ మహారాజ్‌ను కోహ్లీ, అతని భార్య, సినీ నటి అనుష్క శర్మ, వాళ్ల పిల్లలు వామిక, ఆకాయ్‌లతో కలిసి దర్శించుకున్నారు. ఆ తర్వాత సడెన్‌గా ముంబై వచ్చిన కోహ్లీ, గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర దర్శనమిచ్చాడు. జనంలో కలిసిపోయిన కోహ్లీ, ఒక లేడీ అభిమాని పక్కనే నిలుచున్నాడు. సడెన్‌గా తన పక్కన కోహ్లీ కనిపించడంతో ఆ లేడీ అభిమాని ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలైంది. అభిమానులు లైకులతో పాటు తమకు తోచిన కామెంట్లను జోడిస్తూ, ఆ క్లిప్పింగ్‌ను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్ ట్రెండింగ్‌లో ఉంది.
ఇంతకీ ఆ వీడియలో ఏముందంటే..
గేట్ వే ఆఫ్ ఇండియాలో ఒక ప్రదేశంలో సముద్రాన్ని ఆనుకుని ఒక గోడ ఉంది. అక్కడ చాలామంది గుమి గూడారు. ఇంతలో ఒక యువతి పక్కన నల్లని బట్టలు, టోపీ పెట్టుకుని కోహ్లీ కనిపించాడు. అతడిని చూసిన ఒక యువతి అతను కోహ్లీయేనా..? అనే ఆలోచనలో పడింది. ఆమె సందేహాన్ని గమనించిన కోహ్లీ చొరవ తీసుకుని, ఆమె భుజంపై చేయి వేసి, ఏదో మాట్లాడటం కనిపించింది. స్వయంగా కోహ్లీ తనతో మాట్లాడటంపై ఆ అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. తన ఎక్సప్రెషన్స్ ప్రైస్ లెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన జీవితంలో అత్యంత మధుర మైన మూమెంట్లలో ఇదొకటని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రెస్ట్ మోడ్‌లో కోహ్లీ..
ఆసీస్ టూర్ ముగిశాక లభించిన విశ్రాంతితో కోహ్లీ సేదతీరుతున్నాడు. నిజానికి ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ జరగబోతున్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌కు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో ఆ సిరీస్‌లో తను ఆడటం లేదు. వచ్చే నెల 6 నుంచి ఇంగ్లాండ్‌తోనే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు. వచ్చే నెల 19 నుంచి జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో సత్తా చాటి విమర్శకుల నోర్లు మూయించాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నారు. మరోవైపు గతేడాది వైఫల్యాల బాట పట్టిన టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీకి ఈ వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ చాలా ముఖ్యం. ఇందులో విపలమైతే వారిపై వేటు వేయడం ఖాయమని ఊహగానాలు చెలరేగుతున్నాయి.