Jemima Century: ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 48 ఏళ్ల చరిత్రలో తొలిసారి 370 పరుగుల మార్కును చేరుకుంది. ఆదివారం తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 370 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ (91 బంతుల్లో 102, 12 ఫోర్లు)తో అదరగొట్టింది. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడటంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన ఐర్లాండ్ 7 వికెట్లకు 254 పరుగులు చేసి, 116 రన్స్ తో ఓడిపోయింది. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కోలుకోలేకుండ దెబ్బ తీశారు. జెమీమాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చక్కని శుభారంభం.. ఆదివారం రాజకోటలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు స్మృతి మంధాన ( 54 బంతుల్లోనే 73, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతీకా రావల్ (61 బంతుల్లో 67,8 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడుతూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 156 పరుగులు జోడించడంతో భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్మృతి రెండు కళ్లు చెదిరే సిక్సర్లను సాధించింది. అయితే ఒక్క బంతి తేడాతో వీరిద్దరూ వెనుదిరగడంతో క్ీరజులోకి వచ్చిన జెమమా చెలరేగి పోయింది. తొలుత ఆచితూచి ఆడిన జెమీమా.. కుదురుకున్నాక సొగసైన బౌండరీలు సాధించింది. అలా 62 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్న జెమీమా.. తర్వాత జోరును పెంచింది.
తొలి సెంచరీ..కెరీర్లో ఇప్పటివరకు ఆరు ఫిఫ్టీలు చేసిన జెమీమా తొలిసారి ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించింది. ఫిఫ్టీ తర్వాత దూకుడుగా ఆడిన జెమీమా ఆ తర్వాత కేవలం 28 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకుంది. హర్లీన్ డియోల్ (89) కూడా జెమీమాతో పాటు ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసింది. వీరిద్దరూ మూడో వికెట్కు 183 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. సెంచరీకి చేరువైన హర్లీన్ వెనుదిరిగినా, మిగతా బ్యాటర్ల సాయంతో జెమీమా జట్టుకు భారీ స్కోరు అందించింది. 1976లో ఇంగ్లాండ్ తో తొలి వన్డే ఆడిన భారత జట్టు.. 370 పరుగులు చేయడం ఇదే తొలిసారి. బౌలర్లలో ప్రెండెర్గాస్ట్, కెల్లీకి రెండు వికెట్లు దక్కాయి. భారీ టార్గెట్ ను చూసి బెదరి పోయిన ఐర్లాండ్ మహిళలు నింపాదిగా ఆడారు. వాళ్లు ఏ దశలోనూ విజయం కోసం ప్రయత్నించలేదు. ప్రెండెర్గెస్ట (80) అర్థ సెంచరీతో కాస్త పోరాటం చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు మూడు, ప్రియ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సిరీస్ ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. మూడో వన్డే ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది.
Also Read: IPL-2025 UPdate: ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ