Ind vs SL, 2nd Test: శ్రీలంక(Sri Lankan)తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా పేలవంగా ఆడుతోంది. టీమిండియా బ్యాటర్లను లంక బౌలర్లు దారుణంగా దెబ్బ తీశారు. మయాంక్ అగర్వాల్ (4)(Mayank Agarwal), రోహిత్ శర్మ (15) (Rohit Sharma), హనుమ విహారి (31) (Hanuma Vihari ), విరాట్ కోహ్లి (23) (Virat Kohli) వెంట వెంటనే అవుటై పెవిలియన్ బాట పట్టారు. చిన్నస్వామి స్టేడియం( Chinnaswamy Stadium)లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 59.1 ఓవర్లకు 252 పరుగులకు ఆలౌటైంది. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Iyer)(92; 98 బంతుల్లో 10x4, 4x6) తన కెరీర్లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు.
డే అండ్ నైట్ టెస్టులో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆదిలోనే శ్రీలంక బౌలర్లు టీమిండియాకు చుక్కలు చూపించారు. జట్టు స్కోరు 100కి చేరుకోకముందే టాప్ త్రీ బ్యాటర్‌లను కోల్పోయింది టీమిండియా. తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కాపాడాల్సిన బాధ్యత భుజాన వేసుకున్నాడు.
కీలకమైన దశలో జాగ్రత్తగా ఆడాల్సిన కోహ్లీ చాలా ఇబ్బంది పడుతూ క్రీజ్‌లో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. ధనుంజయ్ డిసిల్వ వేసిన అద్భుతమైన బంతికి దొరికిపోయాడు కోహ్లీ. దీంతో 23 పరుగుల వద్ద వెనుదిరిగాడు కోహ్లీ. విరాట్ హునామా విహారితో కలిసి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీళ్ల జోడీ క్రీజులో పాతుకుపోతుందన్న టైంలో ధనుంజయ్ దెబ్బతీశాడు.
బంతిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా వికెట్ల దగ్గర దొరికిపోయిన కోహ్లీ చాలా అసహనంతో క్రీజ్ వద్దే నిలబడి పోయాడు. అతని హావభావాల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.